Home Filmy Adda ప్రభాస్ మూవీ విషయం పై క్లారిటీ ఇచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7 డైరెక్టర్..!

ప్రభాస్ మూవీ విషయం పై క్లారిటీ ఇచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7 డైరెక్టర్..!

by Anudeep

తదుపరి ‘మిషన్: ఇంపాజిబుల్’ సినిమాలో టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా నటిస్తున్నారంటూ.. గత కొన్ని రోజులు గా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తన రాబోయే పాన్-ఇండియా చిత్రం రాధే శ్యామ్ కోసం ఇటలీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ మిషన్ ఇంపాజిబుల్ 7 జట్టుని కలిసినట్లు ఈ వార్తల సారాంశం. అయితే.. ఈ వార్తల విషయమై అటు ప్రభాస్ కానీ, చిత్ర బృందం గాని స్పందించలేదు.

prabhas

అయితే ఈ విషయమై లోకేష్ వల్లపురెడ్డి అనే ట్విట్టర్ యూజర్ క్లారిటీ ఇవ్వాల్సింది గా కోరారు. దీనిపై స్పందించిన దర్శకుడు మెక్ క్వారీ “అతను చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి అయితే, మేము ఎప్పుడూ కలవలేదు.” అని స్పష్టత ఇచ్చారు. తాను ప్రభాస్ ను అసలు కలవలేదని ఆయన పేర్కొన్నారు. దీనితో ఈ వార్తా కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది.

You may also like