చన్నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

చన్నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

by Anudeep

Ads

చన్నీటితో స్నానం అనగానే చాలామంది ఇష్టపడరు వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి హాయిగా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలోచనలు సరైనవి కాదని శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల నుండి శాస్త్రవేత్తలు చన్నీటి స్నానం పై చేస్తున్న అధ్యయనాలు చెప్తున్నా ఫలితాలు ఎంతో ఆశ జనకంగా ఉన్నాయి. చన్నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది అంతే కాకుండా శరీరంలో మరియు గుండెలోని రక్తనాళాల వద్ద అధికంగా పెరిగిపోయిన క్రొవ్వు కలిగించే చెడు ప్రభావాలు నుంచి చన్నీటి స్నానం ఉపసమానం కలిగిస్తుంది అని ఈ అధ్యయనాల్లో తేలిసింది.

Video Advertisement

సాధారణంగా శీతాకాలంలో చాలా మంది చన్నీటిని చేతితో కూడా తాకడానికి కూడా ఇష్టపడరు చన్నీరు అంటేనే గజగజ వణికిపోతూ ఉంటారు కానీ చలి బాగా ఉన్న సమయంలో సముద్రంలో లేదా నదిలో లేదా ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ లేదా స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు చల్లని నీరు మన శరీరాన్ని తాకినప్పుడు శరీరానికి ఏదో ప్రమాదం జరుగుతుంది అని భావించడం వల్ల తనను తాను రక్షించుకునే ప్రక్రియలో భాగంగా శరీరం అంతా యాక్టీవ్ అవుతుందని అందువల్లే ఈ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాక రోజు చన్నీటి స్నానం చేయడం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేసే వారిలో శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని కూడా తెలియజేశారు. చన్నీటి స్నానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నందు వల్ల అందరూ మెల్లగా దాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం చన్నీటి తో గడపడం వల్ల చెడు ప్రభావాలు ఉన్నాయని కేవలం పరిమిత సమయం మాత్రమే చన్నీటితో గడపాలని తెలియచేసారు.


End of Article

You may also like