Ads
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అలా ఎన్నో కష్టాలు పడి, ఎంతో బాగా చదివి, మొదటి అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్ తో సివిల్స్ లో విజయం పొందారు టీ.వీ. అనుపమ. అనుపమ కేరళకి చెందిన వారు. డ్యూటి విషయానికొస్తే అనుపమ రాజకీయ రంగానికి చెందిన ఎంత పెద్ద వ్యక్తులకైనా, ముఖ్యమంత్రికి అయినా సరే భయపడరు. ధైర్యంగా న్యాయం వైపు నిలబడతారు. ఇందుకు 2017 లో జరిగిన ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
Video Advertisement
అది కేరళలోని ఆలప్పుళ జిల్లా. ఆ జిల్లాలోని మార్తాండం చెరువును పరిశీలిస్తున్నారు ఆ జిల్లా కలెక్టర్ అయిన అనుపమ. అక్కడ ఒక కట్టడం కోసం చెరువు సగం లెవెల్ చేసి ఉంది. ఆ చెరువుని ఆనుకొని ఇంకొక వైపు వరి పొలాలు ఉన్నాయి. అక్కడ ఉన్న సబార్డినేట్స్ ని అనుపమ ఇక్కడ ఏం కడుతున్నారు అని అడిగారు. అందుకు సబార్డినేట్ పార్కింగ్ లాట్ అని చెప్పారు. అనుపమ కార్లో కూర్చొని అక్కడి నుంచి కదిలినప్పుడు ఆ సంబంధిత సబార్డినేట్ ఒక విషయం చెప్పారు.
ఆ సబార్డినేట్ “మేడమ్, ఇందులో మంత్రి గారి హస్తం ఉంది. ప్రతిపక్షాల నుంచి చాలా కంప్లైంట్ వచ్చినా సరే మేనేజ్ చేశారు. అంతే కాకుండా ఈ విషయాన్ని నిరూపిస్తే మినిస్టర్ పదవికి మాత్రమే కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను” అని అన్నారని చెప్పారు. ఈ విషయాన్ని విన్న అనుపమ ఈ కట్టడం లేనప్పటి సమయంలో చెరువుకు సంబంధించిన ఫోటోలు ఇవ్వమని అడిగారు.
ఆ సబార్డినేట్ ప్రయత్నిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆ చెరువుకి చెందిన శాటిలైట్ ఫోటోలు వచ్చాయి. ఆ పాత ఫోటోలని ఇప్పటి ఫోటోలుని పోల్చి చూస్తే అంతకుముందు చెరువు ఎలా ఉందో స్పష్టం గా కనబడుతోంది. ఈ విషయాలన్నిటినీ పెట్టి పూర్తి వివరాలతో ఒక నివేదిక తయారు చేసి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించారు అనుపమ.
దీని మీద ఆ సంబంధిత వ్యక్తి కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టిపారేసింది. కేరళ ప్రభుత్వం ప్యాడీ అండ్ వెట్ ల్యాండ్ యాక్ట్ కింద ఈ నేరం రుజువైంది. ఆ మంత్రి కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాండి. ఈ సంఘటన తర్వాత అనుపమ పేరు కేరళ అంతా మారు మోగిపోయింది.
End of Article