Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ సలార్ రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటారు.
Video Advertisement
మొదటి భాగంలో వదిలేసిన చాలా ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానం చెప్తారు. అయితే, సాధారణంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్యాలెట్ లో ఉంటాయి అన్న సంగతి తెలిసిందే.
ఎన్ని కలర్స్ వాడినా కూడా అవన్నీ చాలా డల్ గా బ్లాక్ కలర్ గ్రేడింగ్ తో కనిపిస్తాయి. అంతకు ముందు వచ్చిన కేజిఎఫ్ సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. హీరో ఎక్కువగా బ్లాక్ కలర్, లేదా డార్క్ కలర్ బట్టల్లోనే కనిపిస్తాడు. ఎప్పుడో ఒకసారి వేరే కలర్ బట్టలు ధరించినా కూడా సినిమా మొత్తం డార్క్ గానే ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత చాలా సీన్స్ చీకటిలో తీసినట్టు అనిపిస్తాయి. బ్రైట్ నెస్ పెంచుకుంటే కానీ అక్కడ ఒరిజినల్ కలర్ ఏంటి అనేది అర్థం కాదు.
కొన్ని సార్లు బ్రైట్ నెస్ పెంచాక మాత్రమే ఆ సీన్ క్లియర్ గా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే ఇది ప్రశాంత్ నీల్ స్టైల్. కానీ దీనిపై సరదాగా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. “ప్రతి ఒక్కళ్ళ మీద బొగ్గు పౌడర్ చల్లుతారు ఏమో” అని అంటూ ఉంటారు. “సినిమాలో హీరో, హీరోయిన్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, బొగ్గుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది” అని కామెడీగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే సలార్ సినిమాలోని ఒక సీన్ కలర్ గ్రేడింగ్ మార్చి సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు.
ఈ సీన్ ఒరిజినల్ సీన్ తో పోలిస్తే చాలా బ్రైట్ గా ఉంది. కలర్స్ కూడా ఒరిజినల్ కలర్స్ ఏంటి అనేది ఎడిటెడ్ సీన్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కూడా, “ఒరిజినల్ గా వీళ్ళు ధరించిన కలర్స్ ఇలా ఉంటాయా?” అంటూ షాక్ అవుతున్నారు. “సినిమాలో వాడిన కలర్ గ్రేడింగ్ తో చూస్తే అసలు వాళ్ళ డ్రెస్ కలర్స్ అర్థం అవ్వలేదు” అని అంటున్నారు. అంతే కాకుండా, “ఒకవేళ ప్రశాంత్ నీల్ ఈ ఎడిట్ చూస్తే, తన సినిమాలో ఇన్ని కలర్స్ ఉన్నాయా అని షాక్ అవుతారు ఏమో” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
Colour Full Khansaar 🔥🔥#Prabhas #Salaar pic.twitter.com/q2FApKRzel
— Pavan Keerthy (@KeerthyPavan) January 22, 2024
ALSO READ : “1000 అయ్యింది.. రెండు లివర్ లు ఎక్స్ట్రా” అని ట్రోల్ చేసారు… కానీ ఈ అసలు లెక్క ఏంటో తెలుసా.?
End of Article