Ads
ఎన్నో సంవత్సరాల నుండి కమెడియన్ గా, హీరోగా, అలాగే ఎన్నో ముఖ్య పాత్రల్లో మనల్ని అలరిస్తున్న నటుడు సునీల్. సునీల్ సెకండ్ హ్యాండ్ అనే ఒక సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ సినిమా ప్రొడక్షన్ సమయంలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ప్రేమ కథ, స్వయంవరం సినిమాల్లో నటించారు.
Video Advertisement

Sunil with his family
తర్వాత వచ్చిన చిరునవ్వుతో, నువ్వే కావాలి సినిమాలు సునీల్ కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. వాటిలో నువ్వే కావాలి మొదట విడుదలైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించారు సునీల్. తన మేనరిజమ్స్, కామెడీ టైమింగ్ తో టాప్ యాక్టర్ గా ఎదిగారు. ఆ తర్వాత అందాలరాముడు సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టారు సునీల్.

Sunil with his mother
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్నతో పాటు, పూలరంగడు, భీమవరం బుల్లోడు, ఇంకా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురం లో సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అంతే కాకుండా ఇటీవల వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించారు సునీల్.

comedian Sunil wife
అయితే సునీల్ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నా కూడా ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడలేదు. సునీల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు కూడా ఎక్కడా బయటకు రాలేదు. సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శృతి ఎక్కువగా బయట కనిపించరు.

Sunil with his mother

Comedian Sunil family

Comedian Sunil family

Comedian Sunil wife and mother
End of Article