Ads
అటు నటుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న యాక్టర్ బాలకృష్ణ. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇవాళ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నలుగురు నటులు నాలుగు స్తంభాలు అని అంటారు. వారిలో ఒకరిగా బాలకృష్ణ నిలిచారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరొక పక్క ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలా ఇవాళ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఒక బస్సు యాత్రను ప్రారంభించారు.
Video Advertisement
కదిరి నుండి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ ఎంతో మంది అభిమానులు బాలకృష్ణ కోసం వచ్చారు. సెల్ఫీ కోసం ఎగబడ్డారు. కొంత మంది వ్యక్తులు ఒక గుంపుగా వచ్చి బాలకృష్ణ దగ్గరికి సెల్ఫీ కోసం ఎగబడడంతో బాలకృష్ణ తన చేతికి పని చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంత మంది ఒకేసారి రావడంతో ఆగ్రహానికి గురైన బాలకృష్ణ, ఒక అభిమానిని మోచేతితో కొట్టారు. దాంతో బాలకృష్ణ మీద మళ్ళీ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. బాలకృష్ణ ఇలా సెల్ఫీల కోసం ఎగబడిన వారిని కొట్టడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. అయితే, ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.
సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు బయటికి వెళ్లినప్పుడు బౌన్సర్లని నియమించుకుంటారు. అభిమానులు కానీ, లేదా అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఆ సెలబ్రిటీ దగ్గరికి వస్తూ ఉంటే బౌన్సర్స్ అదుపు చేస్తారు. కానీ బాలకృష్ణ బౌన్సర్లని నియమించుకోలేదు. తన చుట్టూ ఎంత మంది అభిమానులు వచ్చినా కూడా తనే చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. సాధారణంగా ఎంత జనం ఉన్నా కూడా అదుపు చేయడానికి బాలకృష్ణ ప్రయత్నిస్తారు.
కానీ అప్పుడప్పుడు ఇలా జరగడంతో బాలకృష్ణ చేతికి పని చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. తన అభిమానులని తిట్టినా, వారు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే అది చెప్పడానికి కూడా తను మాత్రమే చేయాలి అని, తన అభిమానులతో మరొకరు దురుసుగా ప్రవర్తించడం, లేదా వారి మీద చేయి ఎత్తడం ఇష్టం లేని కారణంగా బాలకృష్ణ బౌన్సర్లని నియమించుకోలేదు. అవన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది మాట్లాడే ముందు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు బౌన్సర్లని పెట్టుకోకుండా జనాలని తనే అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
watch video :
సెల్ఫీ అడిగిన అభినానిని ఈడ్చి కొట్టిన బాలకృష్ణ. pic.twitter.com/k19xkZqxBm
— Actual India (@ActualIndia) April 13, 2024
ALSO READ : సుమ డాన్స్ వీడియోస్ లో ఈయన బాగా హైలైట్ అవుతారు..! ఈ వ్యక్తి ఎవరంటే..?
End of Article