సుమ డాన్స్ వీడియోస్ లో ఈయన బాగా హైలైట్ అవుతారు..! ఈ వ్యక్తి ఎవరంటే..?

సుమ డాన్స్ వీడియోస్ లో ఈయన బాగా హైలైట్ అవుతారు..! ఈ వ్యక్తి ఎవరంటే..?

by Mohana Priya

Ads

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు సుమ. ఎన్నో సంవత్సరాల నుండి సుమ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ ఉంది అంటే, అందులో సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. సుమ యాంకర్ గా చేస్తే ప్రోగ్రాం మొత్తానికి కూడా ఒక ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా వేదిక మీద సుమ యాంకరింగ్ ని మెచ్చుకున్నారు. సుమ వస్తే ఒక పాజిటివ్ వాతావరణం వస్తుంది అని చాలామంది అన్నారు. అయితే సుమ గత కొంత కాలం నుండి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

Video Advertisement

man in suma dance video

అంతకుముందు ఇంత యాక్టివ్ గా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇందులో సుమ తెర వెనుక ఎలా ఉంటారు అనేది చూపిస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తూ ఉంటే సుమ స్టేజ్ మీద మాత్రమే కాదు, సాధారణంగానే మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి అని అర్థం అవుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలలో సుమ తనతో పాటు తన స్టాఫ్ మెంబర్స్ ని కూడా కలుపుకుంటూ ఉంటారు. వాళ్లతో కలిసి కొన్ని డాన్స్ వీడియోలు చేస్తూ ఉంటారు. అలా సుమతో డాన్స్ వీడియో చేస్తున్న ఒక వ్యక్తి చాలా ఫేమస్ అయ్యారు. సుమ పోస్ట్ చేసే ఆ డాన్స్ వీడియోలో ఆయన డాన్స్ ఎప్పుడూ హైలైట్ అవుతుంది.

man in suma dance video

అసలు వచ్చే పాటకి, స్టెప్స్ కి సంబంధం లేకుండా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు చూసిన ప్రతిసారి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. దాంతో ఆయన డాన్స్ కి చాలా మంది అభిమానులు అయిపోయారు. కానీ ఆయన ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఆయన పేరు రమేష్ అయినాల. రమేష్ కాస్ట్యూమ్ అసిస్టెంట్. సుమకి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖులకు కాస్ట్యూమర్ గా చేశారు. సుమకి ఎన్నో సంవత్సరాల నుండి కాస్ట్యూమర్ గా వ్యవహరిస్తున్నారు. రమేష్, సుమ షేర్ చేసే ప్రతి డాన్స్ వీడియో లోనే ఉంటారు. డాన్స్ వీడియోలో మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు సుమ చేసే కామెడీ వీడియోస్ లో కూడా కనిపిస్తూ ఉంటారు.

watch video :

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma)

ALSO READ : ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైన ఉద్యోగం… కానీ తక్కువ జీతం..! అదేంటంటే..?


End of Article

You may also like