Ads
మన తెలుగు వాళ్ళకి సినిమాలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అంటే ఇతర ప్రాంతం వాళ్ళకి ఉండదు అని కాదు. కానీ వారికి కొంచెం ప్రాంతీయ భేదం ఉంటుంది. అంటే, మిగిలిన భాషల సినిమాలని ఆదరించినా కూడా, వారి సినిమాలు అంటే కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
Video Advertisement
మన దగ్గర మన హీరోలని ఏ రేంజ్ లో అభిమానిస్తారో తెలుసు. కానీ ఇతర భాషల హీరోలు మంచి సినిమాలు ఇస్తే, వారిని కూడా అదే రేంజ్ లో అభిమానిస్తారు. అందుకే ప్రతి భాషకి చెందిన సినిమాలని తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు.
తెలుగులో తమిళ్ హీరోలకి దాదాపు తెలుగు హీరోలకి ఉన్న అంత క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా, రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, అజిత్, విజయ్ లాంటి వారిని తెలుగులో కూడా స్టార్ హీరోల కింద చూస్తారు. వారి సినిమా వస్తోంది అంటే ఒక తెలుగు సినిమా వస్తోంది అన్నట్టే లెక్క వేస్తారు. ఈ మధ్య తమిళ్ యంగ్ హీరోలు అయిన శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి వారు కూడా తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు.
డాక్టర్ సినిమా నుండి శివ కార్తికేయన్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పుడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలకి పోటీగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా రిలీజ్ అవుతోంది. అసలే సంక్రాంతి సినిమాలకి కొదవలేదు అంటే, ఇప్పుడు ఇది కూడా యాడ్ అయ్యింది. కానీ దాదాపు ప్రతి సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమా వస్తోంది. కాబట్టి ఈ సారి ఈ సినిమా వస్తోంది. మరొక పక్క బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి పోటీగా విజయ్ హీరోగా నటించిన లియో సినిమా రిలీజ్ అవుతోంది.
అయితే విజయ్ మీద మన తెలుగు వాళ్లకి మాత్రం ఒక కంప్లైంట్ ఉండిపోయింది. దాంతో ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్లీ ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే, విజయ్ సినిమాలకి తెలుగులో దాదాపు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాకి ఉన్నంత డిమాండ్ ఉంది. అంటే ఒక తెలుగు స్టార్ హీరో లాగా. అయితే మన హీరోలు వారి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే ఏదో ఒక రకం అయిన ఇంటర్వ్యూలు ఇవ్వడం, లేదా ఇంకేదో చేసి సినిమాని ప్రమోట్ చేయడం చేస్తూ ఉంటారు.
కానీ విజయ్ మాత్రం తెలుగులో తుపాకీ సినిమా టైంలో కనిపించారు అంతే. మళ్లీ ఇప్పటి వరకు ఒక్క తెలుగు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. కానీ దాదాపు పది సంవత్సరాల నుండి విజయ్ హీరోగా నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. “కనీసం ఒక్క ఈవెంట్ అయినా చేయడానికి తీరిక లేదా?” అని చాలా మంది కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ చాలా పెద్ద స్టార్ హీరో.
అలాంటి వ్యక్తి తన విక్రమ్ సినిమా కోసం తెలుగులో పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అప్పటికే స్టార్ డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి కూడా ఇతర భాషలో మన సినిమాని ప్రమోట్ చేశారు. అంతెందుకు. మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకి మహేష్ బాబు తమిళ్ లో కొన్ని షోలలో పాల్గొని, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో కలిసి సినిమాని ప్రమోట్ చేశారు. అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. కానీ విజయ్ మాత్రం తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేదా కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా ఏదైనా మాట్లాడడం కానీ చేయలేదు.
ఇంకొక పక్క, శివకార్తికేయన్ రెమో తర్వాత నుండి తెలుగులో రిలీజ్ అయిన తన ప్రతి సినిమా కోసం ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వచ్చి రాని తెలుగులో అయినా కూడా ప్రయత్నించి మాట్లాడి “మా సినిమా చూడండి” అని చెప్తున్నారు. దాంతో, “శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోని చూసి అయినా విజయ్ నేర్చుకోవాలి ఏమో. ప్రమోషన్ లేకపోయినా సరే సినిమా చూస్తారు అని అనుకోకూడదు” అని అంటున్నారు.
ALSO READ : “శ్రీరామ చంద్ర” నటించిన పాపం పసివాడు చూశారా..? ఎలా ఉందంటే..?
End of Article