మహిళా IAS అధికారి మీద ఫైర్ అవుతున్న నెటిజెన్లు..! ఉద్యోగానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ..?

మహిళా IAS అధికారి మీద ఫైర్ అవుతున్న నెటిజెన్లు..! ఉద్యోగానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ..?

by Harika

Ads

ఒక వ్యక్తి తన వృత్తికి గౌరవం ఇవ్వాలి. వృత్తిని దైవంతో సమానంగా భావించాలి. వాళ్లు చేసే పని చిన్నదైనా సరే. పెద్దదైనా సరే. వారికి ఉపాధి కల్పిస్తున్న పనిని దేవుడితో సమానంగా పూజించాలి. ఇదే అందరూ ఆచరించే ఫార్ములా. అలాంటి విషయాల మీద సరదాకి చిన్న జోక్ వేసినా కూడా చాలా మంది ఆ జోక్ ని జోక్ లాగా తీసుకోలేరు. “వృత్తి మీద అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి విషయంలో అదే జరుగుతోంది. అయితే ఇక్కడ ఆవిడ ఏమి మాట్లాడలేదు. కానీ ఆమె షేర్ చేసిన ఒక వీడియో మీద కామెంట్స్ వస్తున్నాయి.

Video Advertisement

comments on ias officer pamela satpathy

ఐఏఎస్ పమేలా సత్పతి 2015 బ్యాచ్ కి చెందిన అధికారి. ఆగస్టు 27వ తేదీ, 1987 లో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని సునాబెడలో జన్మించారు. పదవ తరగతిలో 92 శాతం మార్కులు సాధించారు. ఆ తర్వాత 12వ తరగతిలో కూడా సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలో 87 శాతం మార్కులు సాధించారు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేశాక, ఇన్ఫోసిస్ లో పనిచేశారు. ఆ తర్వాత శిక్షా ఓ అనుసంధన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పని చేశారు.

comments on ias officer pamela satpathy

2015లో ఐఏఎస్ పూర్తి చేసుకొని, భద్రాచలం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించి, అక్కడ 19 నెలలు పనిచేసిన తర్వాత, 3 నెలల పాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా, ఆ తర్వాత ఒక 11 నెలల పాటు భూసేకరణ శాఖలో పనిచేశారు. 2019 డిసెంబర్ లో వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ గా తన విధులు నిర్వహించారు. జూన్ 14వ తేదీ,  2021 లో యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమితులు అయ్యారు. జూలై 31 వ, తేదీ 2023 లో సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ అయ్యారు. 2012, డిసెంబర్ 8వ తేదీన ప్రముఖ డాక్టర్ దీపాంకర్ తో పమేలా సత్పతి పెళ్లి జరిగింది. వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు ఆ అబ్బాయి పేరు నైతిక్ సత్పతి.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే పమేలా సత్పతి, ఇటీవల తన కొడుకుకి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. అందులో, “సంవత్సరం మొత్తంలో ఎంతో ఎదురు చూసిన సమయం ఇప్పుడు సంవత్సరం మొత్తంలో భయంకరమైన సమయంగా మారింది. మీరు మీ అమ్మ కొడుకు అయితే ఇలాగే ఉంటుంది” అంటూ, తన కొడుకు ఆఫీస్ డెస్క్ మీద ఆడుకుంటున్న వీడియోని షేర్ చేశారు. దీన్ని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించారు. “వర్కింగ్ ఉమెన్ కి పిల్లలని చూసుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు దీన్ని బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు” అని పొగిడే వాళ్ళు కొంత మంది ఉంటే, “ఒకవేళ మీ జూనియర్స్ ఇదే పని చేస్తే మీరు ఇలాగే ఊరుకుంటారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : ఘనంగా శంకర్ కూతురి వివాహం..! వైరల్ అవుతున్న ఫోటోలు..!


End of Article

You may also like