ఘనంగా శంకర్ కూతురి వివాహం..! వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా శంకర్ కూతురి వివాహం..! వైరల్ అవుతున్న ఫోటోలు..!

by Mohana Priya

Ads

ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురి వివాహం ఘనంగా జరిగింది. శంకర్ మొదటి కూతురు ఐశ్వర్య పెళ్లి నిన్న జరిగింది. ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యి కొత్త దంపతులను ఆశీర్వదించారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా శంకర్ కూతురు పెళ్లికి హాజరు అయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు కూడా ఎంతో మంది ప్రముఖులు వెళ్లారు. వారిలో తెలుగు నుండి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి, సురేఖ కూడా వెళ్లారు. హిందీ నుండి రణవీర్ సింగ్ వెళ్లారు.

Video Advertisement

shankar daughter aishwarya wedding pictures

తమిళ ఇండస్ట్రీ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ కనగరాజ్, జయం రవి దంపతులు, దళపతి విజయ్ భార్య సంగీత, విక్రమ్, మణిరత్నం, సుహాసిని ఇంకా ఎంతో మంది వెళ్లారు. శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు, తమిళ్ లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇండియన్ 3 సినిమా కూడా ఉంటుంది అని ఇప్పటికే ప్రకటించారు. భారతీయుడు సినిమాకి సీక్వెల్స్ గా ఇవి రూపొందుతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో శంకర్ కొద్ది రోజులు విరామం తీసుకుని తన కూతురి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. కొంత కాలం క్రితం శంకర్ కూతురి ఎంగేజ్మెంట్ జరిగింది. శంకర్ అసిస్టెంట్ తరుణ్ కార్తికేయన్ తో ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ పెళ్లికి హాజరు అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ALSO READ : TSRTC బస్సులు ఈ సమయంలో ఎందుకు అందుబాటులో ఉండవు..? అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?


End of Article

You may also like