Home Filmy Adda మొన్నటివరకు ట్రోల్ చేశారు… ఇప్పుడు పొగుడుతున్నారు..! సక్సెస్ అంటే ఇదే ఏమో..!

మొన్నటివరకు ట్రోల్ చేశారు… ఇప్పుడు పొగుడుతున్నారు..! సక్సెస్ అంటే ఇదే ఏమో..!

by Megha Varna

చదువు ,వ్యాపారం, ఉద్యోగం ఇలా కారణం ఏదైనా చాలామంది తమ సొంత ఊరికి దూరం అవుతున్నారు. ఎక్కడ జీవనోపాధి ఉందో అక్కడే క్రమంగా సెటిలై దాన్నే తమ సొంత ఊరిగా మార్చుకుంటున్నారు.

అయితే హీరో కిరణ్ అబ్బవరం సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ…సొంత ఊరి విలువలను చాటుతూ చేసిన ఒక వినూత్నమైన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

meter movie review

కిరణ్ అబ్బవరం…ప్రస్తుతం టాలీవుడ్ లో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. రాజా వారు రాణి గారు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలతో మంచి యాక్షన్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అతను నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ అతనికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది.

meter movie review

సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ ఇలా విభిన్నమైన కథాంశాలు సెలెక్ట్ చేసుకుని వరుస సినిమాల తో అతను ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. త్వరలో రూల్స్ రంజన్ అనే సరికొత్త సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కెరియర్ పరంగా బాగా సెటిల్ అయిన ఈ యాక్టర్ ప్రస్తుతం ఒక ఇంటి వాడవుతున్నాడు.

meter movie review

ఇంటివాడు అంటే పెళ్లి కాదండోయ్…తనకంటూ ఒక సొంత ఇల్లు అనే కలను నెరవేర్చుకుంటున్నాడు. సెలబ్రిటీ అయినా.. కామన్ మ్యాన్ అయినా ..ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. అలాగని అతను కట్టే ఇల్లు ఏ హైటెక్ సిటీలో కాదు…తన సొంత ఊరిలో కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నాడు. కిరణ్ కడప జిల్లా రాయచోటికి చెందిన వ్యక్తి. అక్కడే తాను నిర్మించుకుంటున్న సొంత ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతని ఆలోచన తీరుపై అభిమానులు అతన్ని పొగుడుతున్నారు.

https://www.instagram.com/p/CxsmbasRW_-/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

ALSO READ : “అర్జున్ రెడ్డి” మూవీని ఎన్నోసార్లు చూసే ఉంటారు.. కానీ ఇది ఎప్పుడైనా గమనించారా..?

You may also like