Ads
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత నుండి ఈ సినిమాకి ఆశించిన అంత పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. అసలు సినిమా రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది. కొంత మంది గ్రాఫిక్స్ బాలేవు అన్నారు. మరి కొంత మంది అసలు సినిమాలో చాలా తప్పులు చూపించారు అన్నారు.
Video Advertisement
ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కామెంట్స్ ఇంకా పెరిగాయి. రామాయణాన్ని ఈ తరం ప్రేక్షకులకి నచ్చాలి అని తీయడం, అందుకు వారు చేసిన మార్పులు ప్రేక్షకులకి నచ్చలేదు సరి కదా, అసలు ఈ సినిమా టాపిక్ ఎక్కడ వస్తే అక్కడ నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మహేష్ బాబు, రాజమౌళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు సాధారణంగా ఒక మాట అంటారు. “మనం చేసే సినిమాలు మిగిలిన భాషల్లో కూడా ఆదరణ పొందాలి” అని. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. చాలా మంది ఇంటర్వ్యూలో, “మీరు బాలీవుడ్ కి ఎప్పుడు వెళ్తారు?” అని అడిగితే, “నేను తెలుగు సినిమాలు చేస్తాను. అవి బాలీవుడ్ లో హిట్ అవ్వాలి” అని చెప్తూ ఉంటారు. గత సంవత్సరం మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన మేజర్ సినిమా హిందీలో కూడా విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా అక్కడి విలేఖరి ఒకరు, “మీరు బాలీవుడ్ సినిమాలు ఎప్పుడు చేస్తారు?” అని అడిగితే, “నాకు ఇక్కడి నుండి చాలా ఆఫర్స్ వస్తాయి. కానీ వీళ్ళు నన్ను భరించలేరు” అని చెప్పారు. దీనికి వివరణ ఇస్తూ, “నాకు నేను చేసే ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా గౌరవం ఉంది. కాబట్టి నేను అక్కడే సినిమాలు చేస్తాను” అని చెప్పారు.
watch video :
కానీ మహేష్ బాబు చెప్పిన ఈ స్టేట్మెంట్ చాలా తప్పు అని చాలా మంది అప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు చెప్పిందే నిజం ఏమో అని అంటున్నారు. ఒక రకంగా చూస్తే బాహుబలి కూడా అలాగే హిట్ అయ్యింది అని అంటున్నారు. బాహుబలి చేసింది తెలుగులోనే, కానీ అది హిందీలో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇంక రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తాను రాముడి గురించి రాసుకున్న కథ గురించి చెప్పారు.
రాముడు అని ఆయన చాలా శాంతస్వభావి అని, ఎప్పుడో ఒకసారి తప్పితే కోపం రాదు అని, వాల్మీకి అంత బాగా రాశారు అని, తాను అమరేంద్ర బాహుబలి రోల్ కూడా అలాగే రాసుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. ఇది చూసినవారు అందరూ కూడా ఇది కదా ఒక డైరెక్టర్ కి ఉండాల్సిన విజన్ అని రాజమౌళిని ప్రశంసిస్తున్నారు.
watch video :
https://www.instagram.com/p/CtjRGEPJ-1O/?hl=en
ALSO READ : “పోకిరి” గురించి చాలామందికి తెలియని 8 విషయాలివే..! హీరోయిన్ గా మొదట్లో ఎవరిని అనుకున్నారంటే.?
End of Article