“ఈ సినిమా నచ్చింది కానీ… ఆ మంచి సినిమాలు కనిపించలేదా..?” అంటూ… “మహేష్ బాబు-రాజమౌళి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“ఈ సినిమా నచ్చింది కానీ… ఆ మంచి సినిమాలు కనిపించలేదా..?” అంటూ… “మహేష్ బాబు-రాజమౌళి” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

పెద్ద స్టార్ హీరో అయినా, గొప్ప దర్శకుడు అయినా ఒక్కోసారి వారు చేసిన చిత్రాలు ఆడియెన్స్ ను మెప్పించ లేకపోవచ్చు. కానీ ప్రస్తుత రోజుల్లో దానిపై సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్‌లు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా, కొన్నిసార్లు ట్రోల్ చేస్తూంటారు. నెట్టింట్లో విమర్శించడం అనేది సాధారణ విషయంగా మారింది.

Video Advertisement

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి విషయంలో కూడా అదే జరుగుతోంది. దానికి కారణం  మహేష్ నటించిన సినిమా కాదు. జక్కన్న దర్శకత్వం వహించిన మూవీ కాదు. నూతన నటీనటులతో తెరకెక్కిన ఒక చిన్న సినిమాను అభినందిస్తూ, సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేశారు. ఈ కారణంగా ప్రస్తుతం వీరిద్దరు నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
mahesh-and-rajamouliసూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మేమ్ ఫేమస్ మూవీ విడుదల కాకముందే ఈ చిత్రాన్ని చూసి, పాజిటివ్ రివ్యూ పెట్టారు. డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్, రాజమౌళి ఇద్దరూ కూడా ఈ సినిమాని ప్రశంసించారు. అది ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మూవీ చూసిన వారు మహేష్ బాబు, రాజమౌళిల పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు.
‘మేమ్ ఫేమస్’ మూవీని ఓటీటీలో చూసినవారు ఈ చిత్రానికి మహేష్ బాబు, రాజమౌళి ఎలా పాజిటివ్ రివ్యూని పోస్ట్ చేశారనే విషయం అర్థం కావట్లేదని, ఈ సినిమాను ప్రశంసించడం మహేష్ మరియు రాజమౌళిలకి అనవసరం అని కామెంట్స్  చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘బలగం’ మూవీ గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అలాంటివారు ఈ మూవీని ఎలా ప్రశంసించారని అంటున్నారు.
యూట్యూబ్‌లో పెట్టాల్సిన ‘మేమ్ ఫేమస్’ సినిమాని థియేటర్లో విడుదల చేసి, అనవసరమైన హైప్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. కాగా, ఫ్యాన్స్  మాత్రం మహేష్ బాబు, రాజమౌళి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం అలా ట్వీట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం ఏం లేదని, ఒక మూవీ నచ్చడం, నచ్చకపోవడం అనే విషయం వారివారి అభిరుచిని బట్టి ఉంటుందని అంటున్నారు.

Also Read: ఇద్దరూ చెప్పకపోయినా బయటికి వచ్చేసింది..! ఈ పేపర్ లో ఏం ఉంది..?


End of Article

You may also like