“ప్రభాస్” కి పెళ్లి అయితే “ఉదయ్ కిరణ్” లాగా అవుతారా..? ఆయన అలా అనేసారు ఏంటి..?

“ప్రభాస్” కి పెళ్లి అయితే “ఉదయ్ కిరణ్” లాగా అవుతారా..? ఆయన అలా అనేసారు ఏంటి..?

by Anudeep

తెలుగు సినీ పరిశ్రమకు రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేశాడు ప్రభాస్. తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ గా మారిన ఈ యాక్టర్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు పాన్‌ ఇండియా స్టార్‌గా విపరీతమైన క్రేజ్ పెరిగింది.

Video Advertisement

బాహుబలి పుణ్యమా అని వరల్డ్ వైడ్ పాపులారిటీ తన సొంతం చేసుకున్నాడు ఈ అరు అడుగుల అందగాడు. ఇప్పుడు సాహో, రాధే శ్యామ్‌ సినిమాల వల్ల బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ కు పర్సనల్ గా కూడ అభిమానులు ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. సౌత్,నార్త్ అనే తేడా లేకుండా ప్రభాస్ కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

prabhas

ఈ క్రమంలో లో ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఆన్లైన్ లో తెగ చర్చలు జరిగాయి. ఎందరో టాప్ హీరోయిన్ లతో నటించిన ప్రభాస్ ఒక ఇంటి వాడు ఎప్పుడు అవుతాడో అని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన పెళ్లి గురించి నెట్ లో అనేక వార్తలు వచ్చాయి. బాహుబలి కోసం ప్రభాస్ పెళ్లి వాయిదా పడింది అని వెంటనే ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ బాహుబలి పూర్తయి చాలా రోజులైనా ప్రభాస్ ఇంకా అతని పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా వచ్చిన కామెంట్ వైరల్ గా మారింది.

reason behind prabhas movies disappoing after bahubali

ఇప్పటికే 42 సంవత్సరాల వయసు దాటిన ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడైతే బాగుంటుంది అతని అభిమానులు ఆకాంక్ష. ఎలాగైనా ఈ సంవత్సరం డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కి ఒక ఇంటి వాడవుతాడని ఆశించిన అందరికీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కంగారు కలిగించాయి. వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్కు తో ఎందరో సెలబ్రెటీస్ గురించి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం అవి వైరల్ అవ్వడం చాలా కామన్ గా మారింది.

venuswami

వేణు స్వామి చెప్పడం వల్లే రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది అన్న వార్త కూడా ఈ మధ్య నెట్ లో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ క్రమంలో రీసెంట్గా వేణు స్వామి ప్రభాస్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి . ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదని…ఒకవేళ కాదు అని చేసుకుంటే…హీరో ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎదురవుతుందని… వేణు స్వామి చెప్పుకొచ్చారు. రెండు సినిమాలకు అతి తక్కువ కాలంలో స్టార్ హీరో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరస ప్లాపులతో సతమతమయ్యాడు.

uday kiran 1

ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల చాలా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న అందరిని వదిలి వెళ్ళిపోయాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వేణు స్వామి చెప్పడంతో డార్లింగ్ అభిమానులు ఆయన పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం అని భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలపై ప్రభాస్ అభిమానులు పలు రకాల అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు


You may also like

Leave a Comment