Ads
జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఇవాళ జరిగింది. జాతీయ అవార్డులు గెలుచుకున్న అల్లు అర్జున్, ఆలియా భట్ తో పాటు మిగిలిన విజేతలు అందరూ కూడా ఈ వేడుకకు హాజరు అయ్యి అవార్డులు అందుకున్నారు.
Video Advertisement
ఈ సారి తెలుగు సినిమాలకి కూడా చాలా అవార్డులు రావడం అభినందించాల్సిన విషయం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సారి ఈ వేడుకని తెలుగు వాళ్ళు డామినేట్ చేశారు అని అనొచ్చు ఏమో.
అంత మంది తెలుగు వాళ్ళు ఈ వేడుకలో కనిపించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వించదగ్గ విషయం. అయితే మిగిలిన విజేతల సంగతి ఏమో కానీ, అల్లు అర్జున్ పుష్ప సినిమాకి అవార్డు అందుకోవడం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పుష్ప సినిమాలో హీరో పాత్ర ఒక రెగ్యులర్ సినిమాలో హీరో లాగా ఉండదు. అంటే పుష్ప అనే ఒక వ్యక్తి ఒక స్థాయికి చేరడం కోసం తప్పులు అయినా చేశాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు.
అంతే కాకుండా ఎర్రచందనం రవాణా వంటి విషయాలు కూడా ఇందులో హీరో చేస్తాడు. దాంతో, “అసలు అలాంటి ఒక తప్పుడు సందేశం ఇచ్చిన సినిమాకి అవార్డు ఎలా ఇచ్చారు?” అంటూ కామెంట్స్ వచ్చాయి. “అంతే కాకుండా ఇది ఒక కమర్షియల్ సినిమా. అందులో హీరో ఒక కమర్షియల్ హీరో పాత్ర చేశాడు. ఆ సంవత్సరం విక్కీ కౌశల్ చాలా బాగా చేశాడు. అతనికి అవార్డు ఇస్తే బాగుండేది” అని అన్నారు.
కానీ మరి కొంత మంది మాత్రం, “ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక తెలుగు హీరోకి అవార్డు వస్తే గర్వించాలి కానీ, ఇలా మాట్లాడటం ఏంటి?” అని అన్నారు. అయితే ఇదిలా ఉండగా, ఇవాళ అవార్డు ఇస్తూ అక్కడ సినిమా గురించి చెప్పిన విషయం మాత్రం చర్చల్లో నిలిచింది. అవార్డు కోసం అల్లు అర్జున్ ని స్టేజి మీదకి పిలుస్తూ, పుష్ప సినిమా గురించి కూడా అక్కడ అవార్డు ప్రకటిస్తున్న వ్యక్తి ఇలా చెప్పింది. “ఈ సినిమాలో అల్లు అర్జున్ అవినీతి వ్యవస్థని సవాల్ చేసే ఒక వ్యక్తిగా కనిపించారు” అని చెప్పింది.
కానీ నిజానికి, ఈ సినిమాలో పుష్ప అనే వ్యక్తి కూడా అవినీతి పనులే చేస్తాడు. తన అవినీతిని అడ్డుకుంటున్న పోలీసుని కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. దాంతో ఇది చూసిన వాళ్ళు అందరూ కూడా అసలు సినిమా చూసే ఇలా మాట్లాడుతున్నారా? లేక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ చూసి అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : “పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్” కూతురిని చూశారా..? అచ్చం నానమ్మ పోలికలే వచ్చాయి..!
End of Article