Ads
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పాట ఇటీవల చిత్రీకరించారు.
Video Advertisement
ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. గత కొద్ది నెలల నుండి ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకి రామ్ చరణ్ హాజరు అవుతున్నారు. ఇవాళ కూడా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా అనే ఒక షో కి హాజరు అయ్యారు. ఈ షో లో రామ్ చరణ్ కి సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం చర్చలకి దారి తీసింది.

అదేంటంటే రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే మాలలోనే ఉన్నారు కాబట్టి అలాగే హాజరవుతున్నారు. ఈ షో కోసం వెళ్తున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో కూడా దీక్షలోనే కనిపించారు. కానీ ఇవాళ గుడ్ మార్నింగ్ అమెరికా షో కి వచ్చిన ఫొటోస్ లో రామ్ చరణ్ వస్త్రధారణ వేరేగా ఉంది. రామ్ చరణ్ ఒక సూట్ లో హాజరయ్యారు.

దాంతో చాలా మంది, “అదేంటి రామ్ చరణ్ స్వామీ దీక్షలో ఉన్నారు కదా?” అని, “అలా దీక్షలో ఉన్నప్పుడు వస్త్రధారణ మారదు కదా?” అని అన్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. దాంతో అసలు విషయం బయటికి వచ్చింది. అదేంటంటే, రామ్ చరణ్ న్యూయార్క్ లోని క్వీన్స్ గణేష్ టెంపుల్ లో స్వామి దీక్షని తీసేశారు. తాను దీక్ష పట్టి 21 రోజులు అయిన తర్వాత రామ్ చరణ్ ఇవాళ గుడిని దర్శించుకుని అక్కడ స్వామి దీక్షని తీశారు అని రామ్ చరణ్ పి ఆర్ టీ టీం తెలిపారట. రామ్ చరణ్ ఇవాళ ఈ షోలో చాలా విషయాలని మాట్లాడారు.
End of Article
