“ఈ సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… ప్రభాస్ “సలార్” మూవీపై కామెంట్స్..!

“ఈ సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… ప్రభాస్ “సలార్” మూవీపై కామెంట్స్..!

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీసు పై దండయాత్ర చేయడానికి, రికార్డులు తిరగరాయడానికి వచ్చేశాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాహుబలి-2 తరువాత ఆ రేంజ్ లో విజయం రాకపోవడంతో డీలా పడిన అభిమానుల కరువు తీర్చేలా సలార్ మూవీ ఉన్నట్టుగా టాక్.

Video Advertisement

సలార్ మూవీతో ప్రభాస్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సలార్ మూవీలో ఈ సీన్స్ అవసరమా అంటూ కొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  సలార్ రిలీజ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ మూవీలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్ వంటివారు నటించారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కి హిట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో కూడా యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఒక సన్నివేశంలో ఇనుప కడ్డీ పట్టుకుంటే, ఆ రాడ్ పైన ఫింగర్స్ ప్రింట్ పడుతాయి. మరో సన్నివేశంలో ఒక గుద్దు గుద్దితే షాక్ కొట్టిన వాడు బ్రతుకుతడం ఏంటని, కరెంట్ వైర్ సీన్ అవసరమా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ … టాలీవుడ్‌కి ఎందుకు వెళ్ళిపోయాడు.?” అనే ప్రశ్నకు… దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నెటిజన్..!


End of Article

You may also like