“సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… రామ్ పోతినేని “స్కంద” మూవీపై కామెంట్స్..!

“సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… రామ్ పోతినేని “స్కంద” మూవీపై కామెంట్స్..!

by kavitha

Ads

అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ అనంతరం డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో  తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Video Advertisement

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి నేషనల్ లెవెల్ లో హైప్ తీసుకు రావ‌డంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ముఖ్యమైన పాత్రను పోషించాయి. మూవీ రిలీజ్ కు ముందు విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీలోని రెండు సీన్స్ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలు అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, సాయి మంజ్రేకర్, గౌతమి, ఇంద్రజ, మురళి శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలలో నటించారు. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన రెండు ట్రైలర్లలో హీరో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు.  రెండో ట్రైల‌ర్ అయితే గూస్‌బంప్స్ తెచ్చింది.
యాక్ష‌న్ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్‌తో రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కంద మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్. రామ్, శ్రీలీల పెయిర్ బాలేదని, అలాగే వారి మధ్య వచ్చే సీన్స్ అసలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ చెప్పే డైలాగ్స్, స్కూల్ అమ్మాయి లేదా టీనేజర్ కి ఇచ్చినట్టు ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరో సన్నివేశంలో హీరో చాలా హ-త్యలు చేస్తాడు అని చెప్తారు. అన్ని  హ-త్యలు చేస్తే పోలీసులు హీరోని పట్టుకోరా అని ట్రోల్ చేస్తున్నారు.

Also Read: SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like