Ads
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించించాడు. చాలా కాలం తరువాత పఠాన్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. వెయ్యి కోట్లకు పైగా సాధించి బంపర్ హిట్ కొట్టాడు.
Video Advertisement
బాలీవుడ్ బాద్షా షారూఖ్ హీరోగా ప్రస్తుతం ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రివ్యూను తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ప్రివ్యూను చూసిన నెటిజెన్లు కాపీ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ కు ఉన్నక్రేజే వేరు అని చెప్పవచ్చు. షారుక్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వేరే లెవల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘జవాన్’. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, నయన తార, విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రివ్యూను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ప్రివ్యూ ఆద్యంతం ఆకట్టుకునేలా భారీ యాక్షన్ సీన్స్, షారుక్ లుక్స్, మరియు డైలాగ్స్ తో అదిరిపోయింది. చెప్పాలంటే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అభిమనులకి అయితే కనులపండగలా ఉంది. అంతవరకు బాగానే ఉంది. 2 నిమిషాల 12సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో షారుక్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. అలాగే కొన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది.
కొత్త మూవీ కానీ, ట్రైలర్, పోస్టర్, టీజర్ ఇలా ఏది రిలీజ్ అయిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించే నెటిజెన్లు ఈ ప్రివ్యూలో ఉన్న షారుక్ లుక్స్, సీన్స్ వేరే సినిమాల నుండి తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా జవాన్ ట్రైలర్ ప్రివ్యూలోని లుక్స్ ను ఎక్కడి నుండి తీసుకున్నారో ఆ ఫోటోలను కలిపి షేర్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.
బాహుబలి మూవీలో రమ్యకృష్ణ నీటిలో మునుగుతూ చిన్న బాబును రెండు చేతులతో ఎత్తిపట్టుకుంటుంది. జవాన్ ప్రివ్యూలో అలాంటి సీన్ కనిపించింది. మరో సీన్ బైక్స్ పై వచ్చే సీన్, అజిత్ నటించిన వలిమైలో ఇలాంటి సీన్ ఉంటుంది. అపరిచితుడు విక్రమ్ లుక్, హాలీవుడ్ డార్క్ మ్యాన్ మరియు డార్క్ నైట్ సినిమాలలోని లుక్, శివాజీ మూవీలో రజనీకాంత్ గుండుతో కనిపిస్తాడు. అచ్చం అలాగే ట్రైలర్ ప్రివ్యూ చివర్లో లుక్ లో అలాంటి లుక్స్ లో షారుక్ కనిపించాడు. దాంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమాలో ఇన్ని పెట్టరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “పుష్ప 2 ది రూల్” మూవీ ఐటెమ్ సాంగ్ కోసం మేకర్స్ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?
End of Article