Ads
యాంకర్ గా ఎన్నో సంవత్సరాల నుండి అలరిస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల. మరొక పక్క సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్నారు సునీత. వీరిద్దరి పిల్లలు కూడా ఇప్పుడు హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
Video Advertisement
ఒకే సంవత్సరంలో, అది కూడా కొన్ని రోజుల తేడాతో ఇద్దరి సినిమాలు విడుదల అయ్యాయి. సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. కొత్త సంవత్సరం కానుకగా సునీత కొడుకు ఆకాష్ నటించిన సర్కారు నౌకరి సినిమా విడుదల అయ్యింది.
రెండు సినిమాలు రెండు డిఫరెంట్ సబ్జెక్ట్ ల మీద తీశారు. బబుల్ గమ్ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ప్రేమ కథతో పాటు మిగిలిన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరొక పక్క సర్కారు నౌకరి సినిమా విషయానికి వస్తే, ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. సాధారణంగా మాట్లాడుకోవడానికి భయపడే విషయం మీద ఈ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చారు.
అయినా కూడా అది క్లీన్ గా, అందరూ చూసే విధంగా రూపొందించారు. బబుల్ గమ్ సినిమా కథ బాగానే ఉన్నా కూడా, హీరో, హీరోయిన్ కి మధ్య కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే యూత్ ని సినిమా వైపు ఆకర్షించడానికి ఇలాంటి సీన్స్ పెట్టారు ఏమో అనిపిస్తుంది. కాస్త సెన్సిటివ్ సబ్జెక్ట్ ఉన్న సర్కారు నౌకరి సినిమా మాత్రం అందరూ చూసే విధంగా తీశారు. దాంతో, “ఈ విషయంలో సుమ కంటే సునీత ఒక మెట్టు ముందు ఉన్నారు” అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
“మొదటి సినిమాలో అలాంటి సీన్స్ చేయడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది” అంటూ సుమ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అవి ఉన్నా కూడా సినిమా కాన్సెప్ట్ అదంతా ఏమైనా కొత్తగా ఉందా అంటే అది కూడా లేదు. దాంతో “అసలు సబ్జెక్ట్ లేని సినిమా ఎలా తీశారు?” అని అంటున్నారు. కానీ మరొక పక్క, “ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాని ప్రోత్సహించడం చాలా ఆనందకరం” అంటూ సునీత మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : VENKY RERELEASE: రీ రిలీజ్ లో “వెంకీ” రికార్డ్…రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.?
End of Article