Home Filmy Adda “ఓయ్” పాటని ఉదయ్ కోసం “సంధ్య” పాడితే ఇలాగే ఉంటుందా..? ఈ అమ్మాయి పాటకి ఫిదా అవ్వాల్సిందే.!

“ఓయ్” పాటని ఉదయ్ కోసం “సంధ్య” పాడితే ఇలాగే ఉంటుందా..? ఈ అమ్మాయి పాటకి ఫిదా అవ్వాల్సిందే.!

by Mohana Priya

సోషల్ మీడియా అనేది అవసరానికి ఉపయోగిస్తే వరం. సాధారణంగా సోషల్ మీడియా అంటే చాలా మందికి అదేదో ఒక చెడ్డ విషయంలాగా అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియా ద్వారా చాలా ప్రతిభ కూడా అందరికీ తెలుస్తుంది. చాలా మందికి ఏదైనా టాలెంట్ ఉంటే, అది ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకదు.

బయట ఎన్ని చోట్ల ప్రయత్నించినా కూడా ఏదో ఒక రకంగా విఫలం అవుతూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో వారు తమ ప్రతిభని చూపించే వీడియోస్ చేసి అప్ లోడ్ చేస్తారు. దాని ద్వారా వారికి గుర్తింపు రావడంతో పాటు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇలా సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చిన ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు.

comments on thanuja oy female version singer

నటులు, డాన్సర్స్, సింగర్స్ చాలా మంది ఇలా సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభని చూపించి ఎన్నో అవకాశాలు పొందారు. ఇప్పుడు అలా సోషల్ మీడియాలో మరొక వ్యక్తి చాలా ఫేమస్ అయ్యారు. ఆమె తనూజ. ఇటీవల ఓయ్ సినిమా మళ్లీ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ని ఫిమేల్ వర్షన్ పాడి తనూజ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటని శ్రావణి అమరపు రాశారు. అందులో ముఖ్యంగా ఉదయాన్నే సంధ్యే పిలిచేనే అనే ఒక లైన్ ఉంది. “ఆ లైన్ చాలా బాగుంది” అంటూ చాలా మంది పాట రాసిన శ్రావణిని పొగుడుతున్నారు. పాట పాడిన తనూజని కూడా అందరూ అభినందిస్తున్నారు.

comments on thanuja oy female version singer

comments on thanuja oy female version singer

ఈ ఒక్క పాట మాత్రమే కాదు. తనూజ గతంలో ఎన్నో సాంగ్స్ ఇలాగే తనదైన స్టైల్ లో పాడి అప్ లోడ్ చేశారు. ఆ వీడియోస్ కి ఎన్నో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. తనూజ వృత్తిరీత్యా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అలాగే ఒక మంచి సింగర్ కూడా. ఎన్నో పాటలకి ఫిమేల్ వర్షన్స్ పాడి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. హిందీ పాటలను కూడా తెలుగు వర్షన్స్ లో పాడి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో తనూజ గాత్రానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా తనూజ పోస్ట్ లని చూసి అభినందించారు.

watch video :

ALSO READ : “వరలక్ష్మి శరత్ కుమార్” కి కాబోయే భర్తకి ఇంతకుముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

You may also like