“వరలక్ష్మి శరత్ కుమార్” కి కాబోయే భర్తకి ఇంతకుముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“వరలక్ష్మి శరత్ కుమార్” కి కాబోయే భర్తకి ఇంతకుముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇచ్చింది కానీ అతి త్వరలోనే తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని వాటినే చేస్తూ వచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె కెరియర్ ని ఓ రేంజ్ కి తీసుకువెళ్ళింది.

Video Advertisement

రీసెంట్ గా హనుమాన్ సినిమాలో హీరోయిన్ కి అక్కగా చేసిన ఆమె పాత్ర ఆమెకి ఎంతగా పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే, ఇప్పుడున్న లేడీ విలన్స్ లో ద బెస్ట్ అనిపించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమెతో ఎవరు పెళ్లి గురించి మాట్లాడినా పెళ్లిపై ఆమెకు ఆసక్తి లేనట్లు, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అన్నట్లు మాట్లాడే వరలక్ష్మి శరత్ కుమార్ చాలా కామ్ గా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

varalaxmi saratkumar fiancée nicholai sachde

నికోలయ్ సచిదేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ యజమానితో అది కొద్ది మంది సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలోఈ వేడుక జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ ఎవరు ఈ నికోలయ్, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరాలు తీయటం మొదలుపెట్టారు. అయితే అప్పుడే ఎవరికీ ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదేమిటంటే నికోలయ్ కి ముందే పెళ్లయిందని, అతని మొదటి భార్య పేరు కవిత సచ్ దేవ్.

varalaxmi saratkumar fiancée nicholai sachdev

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తర్వాత బేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వరలక్ష్మి అంత పెద్ద నటి కదా ఆమె రెండవ పెళ్లికి వ్యక్తిని చేసుకోవడం ఏంటి అంటూ కొందరు పబ్లిక్ గానే కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మాత్రం గత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వ్యక్తితో జీవితం పంచుకోబోతున్న వరలక్ష్మికి మన అభినందనలు తెలియజేద్దాం అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.


End of Article

You may also like