“ఈ ఒక్కటి అవసరమా..?” అంటూ… “జైలర్” పై కామెంట్స్..!

“ఈ ఒక్కటి అవసరమా..?” అంటూ… “జైలర్” పై కామెంట్స్..!

by kavitha

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను రికార్డులను  క్రియేట్ చేస్తోంది.

Video Advertisement

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీలో ప్రత్యేక పాత్రలలో ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఆ హీరోల క్యారెక్టర్లనే విషయం తెలిసిందే. అయితే తెలుగు ఆడియెన్స్ మాత్రం అన్నీ బానే ఉన్నాయి. కానీ ఈ ఒక్కటి అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. జైలర్ సక్సెస్ లో స్పెషల్ క్యామియోలు కీలకమైన పాత్రను పోషించాయి. డైరెక్టర్ ఈ మూవీ కోసం ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి శివ రాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ వంటివారిని తీసుకున్నారు. వారి పాత్రలు కూడా బాగున్నాయి. వీరిలో కన్నడ స్టార్  శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియెన్స్ లో బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి సునీల్ తీసుకున్నారు. అది కూడా కామెడీ హీరో క్యారెక్టర్.
కోలీవుడ్ ఆడియెన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చినప్పటికి, తెలుగు ఆడియెన్స్ కొందరు మాత్రం సునీల్ పాత్రని ట్రోల్ చేసినట్టుగా ఉందని అంటున్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి అగ్ర హీరోలను తీసుకుని, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపించారని. తెలుగు నుండి సునీల్ వంటి నటుడిని తీసుకుని, కమెడియన్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూవీ హిట్ అయ్యిందని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

Also Read: “జైలర్” సినిమాలో “రజినీకాంత్ కోడలు” పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?


End of Article

You may also like