“వరుసలు కూడా సరిగ్గా తెలుసుకోకుండా పిలవడం ఏంటి..?” అంటూ… “ఉపాసన” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

“వరుసలు కూడా సరిగ్గా తెలుసుకోకుండా పిలవడం ఏంటి..?” అంటూ… “ఉపాసన” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

by Harika

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, వ్యాపారవేత్తగా అందరికీ పరిచయం అయ్యారు ఉపాసన. ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఎంతో మందికి తనకి చేతనయినంత సహాయం చేస్తూ ఉంటారు. ఉపాసన బయట చాలా సింపుల్ గా ఉంటారు. ఎంత ఆస్తి ఉన్నా కూడా చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటారు. తనకి రెడీ అవ్వడం అస్సలు ఇష్టం లేదు అని ఉపాసన కొన్ని సందర్భాల్లో చెప్పారు. రామ్ చరణ్ భార్య కాబట్టి అందరి మధ్యలోకి వెళ్ళినప్పుడు బాగా కనిపించాలి అనే ఉద్దేశంతోనే తాను రెడీ అవుతాను అని, లేదు అంటే ఏదైనా మామూలు సల్వార్ సూట్ లాంటివి ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్పారు.

Video Advertisement

secret revealed about ram charan, upasana baby..!!

ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాల మీద కూడా ఉపాసన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉపాసన ఇటీవల సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మస్ కిచెన్ అనే ఒక వెబ్ సైట్ ఓపెన్ చేశారు. అందులో సౌత్ ఇండియన్ వంటకాలు అయిన ఉప్మా మిక్స్, కొన్ని పొడులు దొరుకుతాయి. ఇప్పుడు ఆవకాయ కూడా అందుబాటులో ఉంది అని చెప్పడానికి ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియో మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఉపాసన వీడియో రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

comments on upasana konidela latest video

చిరంజీవి తల్లి అంజనా దేవి గారు ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఉపాసన మాట్లాడుతూ, “నాయనమ్మ మీరు ఎందుకు సీరియస్ గా ఉన్నారు? మీ కోడలు పచ్చళ్ళు సరిగ్గా పెట్టట్లేదా?” అని అడిగారు. అయితే ఉపాసనకి అంజనా దేవి గారు అమ్మమ్మ అవుతారు. రామ్ చరణ్ కి నాయనమ్మ అవుతారు.  దాంతో, “అమ్మమ్మ అని పిలవకుండా నాయనమ్మ అని పిలుస్తున్నారు ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా నార్త్ ఇండియన్స్ అయితే తమ భర్తలు వారి బంధువులను ఏ వరుసలతో పిలుస్తారో, వాళ్లు కూడా అదే వరుసతో పిలుస్తారు.

కానీ తెలుగుకి వచ్చేటప్పటికి వరుసలు మారుతాయి. అందుకే ఈ విషయం మీద కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది ఇదే విషయం చెప్పి, ఉపాసన నాయనమ్మ అని అందుకే పిలిచారు అని ఆమెకి మద్దతు ఇస్తున్నారు. మరి కొంత మంది మాత్రం మన పద్ధతులు పాటించాలి అని అంటున్నారు. అయితే కొంత మంది ఈ వీడియోలో ఉన్నది ఉపాసన అని అంటూ ఉంటే, మరి కొంత మంది లావణ్య త్రిపాఠి అని అన్నారు. కానీ ఇందులో ఉన్నది ఉపాసన అనిఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : ప్రేమలు సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?


End of Article

You may also like