ప్రేమలు సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

ప్రేమలు సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Mohana Priya

Ads

మలయాళం నుండి విడుదలైన డబ్బింగ్ సినిమాల్లో ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ప్రేమలు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎలాంటి భాష సినిమాని అయినా ఆదరిస్తారు అనే విషయానికి మరొక నిదర్శనంగా నిలిచింది. సినిమాలో నటీనటులు అందరూ కూడా తెలుగు వారికి కొత్త వారే. నటీనటులు మాత్రమే కాదు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయినా సరే సినిమాని విపరీతంగా ఆదరించారు.

Video Advertisement

premalu movie review

రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు. ఎంతో మంది ప్రముఖులు సినిమాని చూసి మెచ్చుకున్నారు. ఊరిలో గొడవలు పడలేక హైదరాబాద్ కి వచ్చిన ఒక అబ్బాయి, ఇక్కడ ఒక ఉద్యోగం చేసే అమ్మాయి, వాళ్ళిద్దరికీ పరిచయం, వాళ్ల స్నేహం ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు డైలాగ్స్ చాలా వరకు మార్చారు. మన తెలుగు రిఫరెన్సెస్ చాలా యాడ్ చేశారు. దాని వల్ల యూత్ లో ఈ సినిమాకి క్రేజ్ ఇంకా పెరిగింది. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఎన్నో డైలాగ్స్ సినిమాలో ఉంటాయి.

premalu movie review

అయితే, ఎంత పర్ఫెక్ట్ గా సినిమా తీయడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడో ఒకచోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక చిన్న పొరపాటు జరిగింది. హీరో విదేశాలకి వెళ్ళిపోయే ముందు రోజు హీరోయిన్ ని కలుస్తాడు. “రేపు 11:30 కి ఫ్లైట్ ఉంది” అని చెప్తాడు. కానీ ఆ తర్వాత రోజు 12:10 అయినా కూడా హీరోయిన్ తో మాట్లాడుతూనే ఉంటాడు. దాంతో, “ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి రెండవ భాగాన్ని ప్రకటించారు. మరి అందులో మొదటి భాగంలో నటించిన వాళ్లే ఉంటారా? లేదా ఇది మరొక కొత్త కాన్సెప్ట్ తో వేరే నటులతో తీస్తున్నారా? ఈ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

mistake in premalu

ALSO READ :  మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో 48 సంవత్సరాల హీరోయిన్..? ఏ పాత్రలో అంటే..?


End of Article

You may also like