మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో 48 సంవత్సరాల హీరోయిన్..? ఏ పాత్రలో అంటే..?

మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో 48 సంవత్సరాల హీరోయిన్..? ఏ పాత్రలో అంటే..?

by Harika

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే లుక్ కోసం మార్పులు చేసుకోవడం, మార్షల్ ఆర్ట్స్, స్కేటింగ్ వంటివి నేర్చుకోవడం మహేష్ బాబు చేశారు. సైలెంట్ గా చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వీడియో చేసి, ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా గురించి ప్రకటిస్తారు. రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ పనులు మొదలు పెట్టారు.

Video Advertisement

mahesh-babu-rare-record2

విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి స్టోరీ రాశారు. మహేష్ బాబు ఇటీవల దుబాయ్ కి వెళ్లారు. మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా దుబాయ్ కి వెళ్లారు. వీళ్లతో పాటు ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు కూడా వెళ్లారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో ఇవాళ దుబాయ్ నుండి హైదరాబాద్ కి చేరుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇందులో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయం అయితే తెలియలేదు కానీ, ఒక నటి ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సిమ్రాన్ గతంలో మహేష్ బాబుతో యువరాజు సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త వచ్చింది. మరి ఏ పాత్రలో నటిస్తున్నారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కొంత మంది మహేష్ బాబు తల్లి పాత్రలో సిమ్రాన్ నటిస్తారు అని అంటున్నారు. “మహేష్ బాబు పక్కన హీరోయిన్ పాత్రలో అయితే సిమ్రాన్ ని ఊహించుకోవడం కష్టం ఏమో. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబుకి సిమ్రాన్ అక్క లాగా ఉంటారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో సిమ్రాన్ ని ఎలాంటి పాత్ర కోసం సంప్రదించారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమాతో రమ్య కృష్ణన్ పాత్రకి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో సిమ్రాన్ నటిస్తే ఆమెకి కూడా అంతే గుర్తింపు వస్తుంది అని అంటున్నారు.

ALSO READ : IAS ఆమ్రపాలి లవ్ స్టోరీ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?


End of Article

You may also like