IAS ఆమ్రపాలి లవ్ స్టోరీ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

IAS ఆమ్రపాలి లవ్ స్టోరీ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

by Mounika Singaluri

Ads

ఆమ్రపాలి కాటా…. తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అభ్యర్థి. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడు సంవత్సరాల పాటు పని చేశారు. అక్కడ కలెక్టర్ గా పని చేసినందుకు కాలం తన పనితీరుతో బాగా హైలైట్ అయ్యారు.

Video Advertisement

ఆమ్రపాలికి తెలుగు రాష్ట్రాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమ్రపాలి యాక్టివ్ గా ఉంటారు. వరంగల్లో పనిచేసిన అనంతరం పిఎం ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు.

అయితే ఆమ్రపాలి గురించి పూర్తి వివరాలు, అలాగే ఆమె భర్త ఎవరు? వీరి ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…! ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నం కి చెందినవారు. వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుండి పీజీ డిప్లమా కూడా చేశారు. 2010 ఏపి క్యాడర్ కి చెందిన ఆమె. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరు ఆమె. 2011 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తన సమీర్ శర్మా ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న వీరి పెళ్లి జరిగింది.

amrapali ias love story

చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఈ వివాహ వేదిక అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సమీర్ ఢిల్లీకి చెందినవారు. 2011లో సమీర్ ఐపీఎస్ కి ఎంపిక అయ్యారు. ఆమ్రపాలి విశాఖ జిల్లాకు చెందినవారు. సమీర్ ఉత్తరాదికి చెందినవారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. కుటుంబాలని ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జమ్ములో వీరి పెళ్లి జరిగింది.


End of Article

You may also like