Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.
Video Advertisement
ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటించారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. అయితే, అంతకు ముందు రామ్ చరణ్ హీరో గా నటించిన ఒక రెండు సినిమాల మధ్య ఈ సినిమా మధ్య ఒక పోలిక ఉంది. రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలో హీరోయిన్ అమలా పాల్, హీరో మొదటిసారిగా కలుసుకునే సీన్ హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు ఉంటుంది.
రంగస్థలంలో కూడా హీరోయిన్ ని హీరో స్నానం చేస్తున్నప్పుడు చూస్తాడు. ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా పూజా హెగ్డేని రామ్ చరణ్ పోషించిన సిద్ధ అనే పాత్ర మొదటి సారి స్నానం చేస్తున్నప్పుడు చూస్తారు. అలా ఈ మూడు సినిమాలకి తెలియకుండానే ఒక కామన్ పాయింట్ ఉంది. ఇంక సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం సినిమాకి అంత మంచి స్పందన రావట్లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అలాగే కాజల్ పాత్ర కూడా సినిమా నుండి తీసేసారు. అందుకు కారణం ఏంటి అనేది సినిమా బృందానికి మాత్రమే తెలియాలి.
End of Article