Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.
Video Advertisement
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.
ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాకి దర్శకత్వం వహించారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాకి దర్శకత్వం వహించి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేశారు. ఇప్పుడు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.
అయితే కొరటాల శివ సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాల్లో దాదాపు అందరు హీరోలు ఒక బ్యాగ్ వేసుకొని కనిపిస్తారు. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్, మిర్చిలో ప్రభాస్, శ్రీమంతుడులో మహేష్ బాబు ఇప్పుడు ఆచార్యలో చిరంజీవి కూడా ఇలాగే బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నారు. సినిమా మొత్తం కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ఈ బ్యాగ్ మాత్రం సినిమాలో హీరోలు కచ్చితంగా వాడతారు. ఇది కొరటాల శివ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తుంది.
End of Article