Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్లో మహేష్ బాబు చాలా స్టైలిష్గా, డిఫరెంట్గా కనిపిస్తున్నారు.
Video Advertisement
సర్కారు వారి పాట సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. ఈ సినిమా మేలో విడుదల అవ్వబోతోంది.
ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14 న విడుదల అవుతుంది. ఈ పాట పేరు కళావతి అని సినిమా బృందం ప్రకటించారు. కళావతి కీర్తిసురేష్ పోషిస్తున్న పాత్ర పేరు. అయితే మహేష్ బాబు గత సినిమాల్లో కూడా ఇలాగే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో చారుశీల పాట ఉంటుంది. ఆ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది.
తర్వాత వచ్చిన భరత్ అనే నేను సినిమాలో కూడా వసుమతి పాట హిట్ అయ్యింది. ఈ రెండు పాటలు గమనిస్తే ఈ రెండు పాటలు కూడా హీరోయిన్ పోషించిన పాత్రల పేర్ల మీదే వచ్చాయి. ఇప్పుడు కళావతి కూడా హీరోయిన్ పోషించిన పాత్ర పేరు మీదే ఉంది. కాబట్టి ఈ పాట కూడా హిట్ అవుతుంది అని నెటిజన్లు అంటున్నారు. పాటకి సంబంధించి అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా ఇటీవల మహేష్ బాబు, కీర్తి సురేష్ ఉన్న ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.
End of Article