ఈ 8 సినిమాల్లో హీరో “అక్క”ను ప్రేమించి “చెల్లి”ని పెళ్లి చేసుకుంటాడు…అందులో ఎన్ని హిట్ అంటే.?

ఈ 8 సినిమాల్లో హీరో “అక్క”ను ప్రేమించి “చెల్లి”ని పెళ్లి చేసుకుంటాడు…అందులో ఎన్ని హిట్ అంటే.?

by Anudeep

Ads

చాలా వరకు సినిమా లో ఇద్దరి హీరోయిన్లు ఉంటారు కానీ చివరికి మాత్రం ఒక హీరోయిన్ కే ప్రాముఖ్యతను ఇస్తారు. కథ మొత్తం హీరో ఎవరని చేసుకుంటాడు అని ఉత్కంఠంగా సాగినప్పటికీ చివరికి హీరో ఏదో ఒక హీరోయిన్ తో మాత్రమే సెటిల్ అవుతాడు. అయితే చాలావరకు ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్లు అక్కాచెల్లెళ్లుగా చూపించడం గమనార్హం.
ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ల అక్కాచెల్లెళ్లుగా ఉన్న సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అవి ఏమిటో , ఓకే సెంటిమెంట్ వాడడం వల్ల అవి ఫట్ అయ్యాయా కట్ అయ్యాయా చూద్దాం.

Video Advertisement

సంతోషం:

నాగార్జున శ్రియ శరన్ గ్రేసీ సింగ్ కాంబినేషన్లో 2002 లో రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైన్ సంతోషం. ఈ చిత్రంలో మొదట గ్రేసీ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జున తర్వాత ఆమె చనిపోవడం తో శ్రియను పెళ్లి చేసుకుంటాడు.

ఏవండోయ్ శ్రీవారు:

2006లో శ్రీకాంత్, స్నేహాన, నిఖిత ల కాంబినేషన్ లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏవండోయ్ శ్రీవారు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా లో మొదట నికితను ప్రేమించిన శ్రీకాంత్ చివరకు స్నేహను పెళ్లి చేసుకుంటాడు.

పౌర్ణమి:

2006లో ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైన పౌర్ణమి. ఇందులో ప్రభాస్ మొదట త్రిష పెళ్లి చేసుకోగా ఆమె అతని కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. తర్వాత అతను చార్మిని పెళ్లి చేసుకుంటాడు. అజంతం ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలబడింది.

జల్సా:

2008 లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జల్సా. ఇందులో పవన్ కళ్యాణ్ ,పార్వతి మెల్టన్ ఇద్దరు పరస్పరం ప్రేమించుకున్న ప్రకాష్ రాజ్ వారించడంతో విడిపోతారు. కానీ తరువాత పవన్ ఇలియానా ప్రేమలో పడతాడు.

అత్తారింటికి దారేది:

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో 2013లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది. ఇందులో తన మేనత్త ఇల్లు చేరిన పవన్ మొదట ఆమె పెద్ద కుమార్తె ప్రణీత ను ఇష్టపడతాడు. కానీ ఆ తర్వాత సమంతను ప్రేమిస్తాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

డియర్ కామ్రేడ్:

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ రష్మిక మందాన కలిసిన 2019 లో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం హిట్గా నిలిచింది.
ఇందులో విజయ్ మొదట ఒక అమ్మాయిని ఇష్టపడి లాస్ట్ కి రష్మికను ప్రేమిస్తాడు. కానీ ఈ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేక పోయింది.

అల్లుడు అదుర్స్:

2021 లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం బెల్లంకొండ సాయి శ్రీనివాస్,నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన అల్లు అర్జున్ ర్స్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలబడింది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ మొదట అను ఇమ్మానుయేల్ ను తర్వాత ఆమెను అతని వదిలి వెళ్ళిన తర్వాత నభానటేష్ ను ఇష్టపడతాడు.

అశోక వనంలో అర్జున కళ్యాణం:

విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో ఈ సంవత్సరం విడుదలైన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం.
ఇందులో మొదట విశ్వక్ సేన్ రితిక నాయక్ ను ఇష్టపడతాడు కానీ ఆ తర్వాత రుక్సారు ను ప్రేమిస్తాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 


End of Article

You may also like