Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.
Video Advertisement
బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది.
అంత ధైర్యాన్ని ఇచ్చారు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో ఒక కామన్ బాగుంటుంది. అది ఏంటంటే సినిమాలో హీరోని కానీ లేదా ముఖ్యపాత్ర పోషించిన వారిని కానీ వెన్నుపోటు పొడుస్తారు. ఛత్రపతి సినిమాలో, యమదొంగ సినిమాలో కూడా హీరోని వెనకనుంచి విలన్ పొడుస్తాడు. విక్రమార్కుడు సినిమాలో కూడా ఇలాగే హీరోని కొడతారు.
ఇంక బాహుబలి సినిమాలో అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం మీద మరొక సినిమానే వచ్చింది. దాంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఒకవేళ అలాంటి సీన్ ఉంటే ఏ హీరో మీద ఉంటుంది అనే ప్రశ్న కూడా నెలకొంది. మరి నిజంగా ఈ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉండబోతోందా అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article