బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ 3 సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ 3 సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

by Anudeep

బాలయ్య-బోయపాటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే.. ఆ సినిమాలపై భారీ గానే అంచనాలు ఉంటాయి. అలాగే.. ఆ సినిమా విడుదల అయ్యాక కచ్చితంగా మంచి పేరు తెచ్చుకుని హిట్ అవుతుంది.

Video Advertisement

ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో విడుదల అయిన సింహ, లెజెండ్ , అఖండలే అందుకు ఉదాహరణలు. సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ.

boyapati

దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే అఖండ ఘన విజయం సాధించింది. అలాగే.. ఈ సినిమా ఇటీవలే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఓటిటిలో కూడా మంచి రేటింగ్ ని సాధించింది. మరి బాలయ్యా మజాకానా.. బిగ్ స్క్రీన్ అయినా.. స్మాల్ స్క్రీన్ అయినా.. చివరికి ఫోన్ స్క్రీన్ అయినా బాలయ్య హవా మాములుగా ఉండదు అని “అఖండ” మరోసారి నిరూపించింది.

Akhanda movie trolls

అయితే.. మీరొక విషయాన్ని గమనించారా..? బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ , అఖండ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ మూడు సినిమాల్లోనూ బాలయ్య బాబు డబుల్ రోల్ చేసారు. అసలు విషయం ఏంటంటే.. ఈ మూడు సినిమాల్లోనూ చిన్న బాలయ్య కనిపిస్తే.. పెద్ద బాలయ్య కనిపించడు. పెద్ద బాలయ్య కనిపిస్తే చిన్న బాలయ్య కనిపించడు. ఇదెక్కడి లాజిక్ అనిపిస్తోంది కదా.

2 boyapati

మరి దీనికి సమాధానం ఏంటో ఆ బోయపాటికే తెలియాలి. మరొక కామన్ విషయం ఏమిటంటే ఈ మూడు సినిమాల లోగోలు ఒకే కలర్ లో ఉంటాయి. కావాలంటే గమనించి చూడండి. ఈ లాజిక్స్ అన్నిటిని పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేయడం అందరికి తెలుసు. అలా చూస్తేనే ఏ సినిమాని అయినా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే.. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన గమనికలోకి వస్తూ ఉంటాయి. అలా అనుకుని వదిలేస్తుంటాం అంతే.


You may also like