పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో తెలుసా.. మీరే చూడండి..!

పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో తెలుసా.. మీరే చూడండి..!

by Anudeep

బాహుబలి కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్ల కాలం త్యాగం చేసేసాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తరువాత సాహో సినిమా కోసం మరో రెండేళ్లు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జోరు పెంచి వరుస గా సినిమా షూట్ లు చేస్తున్నారని ప్రభాస్ ఫాన్స్ సంతోష పడేలోపు షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది.

Video Advertisement

prabhas 1

డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసేసాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసేసుకుంది. కానీ రిలీజ్ అవడానికి ఆలస్యమైపోతోంది. మరో వైపు సలార్, ఆదిపురుష్ షూటింగ్ లు కూడా మొదలు పెట్టేసాడు. కానీ, ఆదిపురుష్ షూటింగ్ కి ఆది లోనే హంసపాదు ఎదురైంది. షూటింగ్ మొదలు పెట్టిన రోజే ఫైర్ ఆక్సిడెంట్ అయింది. ప్రాణ నష్టం జరగలేదు కానీ, షూటింగ్ కి అవసరమైన కొన్ని పరికరాలు కాలిపోయాయి. వాటిని తిరిగి తెప్పించడానికి సమయం పడుతుంది. దీనితో, ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడింది.

prabhas 2

ఈ క్రమం లో ప్రభాస్ కథ విని సినిమా ఒకే చేసేముందు డైరెక్టర్లకి కొన్ని కండిషన్లు పెడుతున్నాడట. ఏ సినిమా కి అయినా, కేవలం మూడు నెలలు మాత్రమే డేట్లు ఇవ్వనున్నాడట. ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలనీ కండిషన్ పెడుతున్నాడట. అలాగే, తానూ సైన్ చేసిన సినిమాను ఆరు నెలల్లో థియేటర్ లో రిలీజ్ చేసేయాలని మరో కండిషన్ పెడుతున్నారట.

prabhas 3

ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ కు ఆల్రెడీ ఈ కండిషన్ గురించి చెప్పేశారట. ప్రశాంత్ నీల్ కూడా అందుకు సిద్ధమయ్యే ముందుకొచ్చారట. ఈ లెక్కన 2022 సంక్రాంతి కి సలార్ రిలీజ్ అయిపోతే, మరో ఆరు నెలలు అంటే.. ఆగష్టు కి ఆదిపురుష్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత 2023 కి నాగ్ అశ్విన్ సినిమా రెడీ గా ఉంటుంది. ఇలా ప్రతి ఆరు నెలలకి ఓ సినిమాను ప్రభాస్ ప్లాన్ చేసుకున్నారు.

 


You may also like