Ads
సాధారణంగా ట్విన్స్ అంటే ఇద్దరు ఒకేలా ఒకే టైం కి పుట్టడం. అలా ఒకేలా, ఒకే టైంకి ముగ్గురు పుడితే వారిని ట్రిపులెట్స్ అంటుంటారు. అయితే.. ట్విన్స్ అయినా, ట్రిపులెట్స్ అయినా కొన్ని ఒకేరకమైన కోరికలని కలిగి ఉంటారు. అన్నిటిలోను కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే.. కాంగోకు చెందిన ఈ ట్రిపులెట్స్ స్టోరీనే వేరు. వారు కూడా అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచిస్తారు. అన్నిటిని సమానంగా పంచుకుంటూ ఉంటారు. చివరకు తమ జీవితాన్ని కూడా అలానే పంచుకోవాలనుకున్నారు.
ఒకే వ్యక్తితో ప్రేమలో పడి అతనినే పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న లక్కీ బాయ్ అని అందరు అనుకుంటున్నారు. కానీ ఈ కథ పెళ్లి పీటల వరకు రావడానికి చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ వ్యక్తి ప్రేమించింది ఒక అమ్మాయినే అయినా.. ఆమె ట్రిపులెట్ సిస్టర్స్ మరో ఇద్దరినీ కలిపి ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
32 ఏళ్ల వయసు ఉన్న లువిజో కాంగోలో నివసిస్తున్నాడు. అతనికి సోషల్ మీడియాలో నటాలీ పరిచయం అయ్యింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అయితే.. నటాలిలా ఉండే మరో ఇద్దరు అమ్మాయిలని కూడా కలిసాను అన్న సంగతి లువిజోకి తెలియదు. ముగ్గురు ఒకేలా ఉండేసరికి లువిజో కేవలం నటాలినే అని అనుకునేవాడు.
అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు అతన్ని కలుస్తూ ఉండేవారు. అలా నటాషా, నడేగే తో కూడా ప్రేమలో పడిపోయాడు. ఓ రోజు ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి వచ్చి తమను పెళ్లి చేసుకోవాలి అని కోరేసరికి లువిజో షాక్ అయ్యాడు. మొదట ఆశ్చర్యపడినా.. తరువాత తేరుకుని విషయం అర్ధం చేసుకున్నాడు. తానూ నటాలినే ప్రేమించినా.. కానీ ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే ముగ్గురు అమ్మాయిలు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కష్టమని చాలా మంది చెప్పి చూసారు. కానీ, ఏదైనా ముగ్గురు పంచుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటు అయ్యిందని నటాలీ చెబుతోంది.
End of Article