Ads
తెలంగాణలో 2023 సార్వత్రిక ఎన్నికలు నవంబర్ 30 వ తారీఖున జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయి అభ్యర్థుల లిస్టు ఖరారు అయింది. ప్రధాన పార్టీలు అన్ని కూడా రసవత్తరంగా ప్రచారాలు చేస్తున్నాయి. ఒకపక్క BRS కేసీఆర్, కేటీఆర్ ల ప్రచారంతో దూసుకుపోతుంది.మరో పక్క కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారంలో ముందడుగులో ఉన్నారు. జనసేన బిజెపి కూటమి కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది.
Video Advertisement
అయితే కెసిఆర్ ఈ పదేళ్ల అభివృద్ధి చూసి మూడోసారి తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఏమో 60 ఏళ్ల అభివృద్ధి కావాలంటే తమకి ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటుంది. తాజాగా కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది. ఇందులో అన్ని వర్గాలకు చెందిన పథకాలను ప్రధానంగా ఉంచారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే మంచిగానే ఉన్న ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేస్తుందో అనేది వేచి చూడాలి.
ఒకసారి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చూద్దాం…!
1.రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు యూత్ కమిషన్ పేరుతో పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించడం.
2. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులను భర్తీ చేయడం.
3. ప్రతి ఏడాది జూన్ రెండో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 తారీకుకి రిక్రూట్మెంట్ పూర్తి చేయడం.
4. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకి 4000 రూపాయలు నిరుద్యోగ భృతి.
5.UPSC తరహాలో TSPSC నీ నిర్వహించడం.
ఇవేకాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు ఉచిత కరెంటు, విద్య వైద్యానికి పెద్ద పీట వేయడం అలాగే రాష్ట్రంలో ఉన్న యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించడం లాంటి కీలకమైన పథకాలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
Also Read:ఫ్యూచర్ రిటైల్ మూసేస్తున్నారా..? ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..?
End of Article