ఫోటో వైరల్: ఒకపక్క చేతిలో పసిబిడ్డ…మరోపక్క సీఎం సభకు సెక్యూరిటీకి.! హ్యాట్సాఫ్ మేడం.!

ఫోటో వైరల్: ఒకపక్క చేతిలో పసిబిడ్డ…మరోపక్క సీఎం సభకు సెక్యూరిటీకి.! హ్యాట్సాఫ్ మేడం.!

by Anudeep

జరుగుతున్నది ముఖ్యమంత్రి కార్యక్రమం .. పెద్ద సభ ,వందల సంఖ్యలో జనాలు  కోలాహలం , భారీ బందోబస్త్ అంతమంది మధ్య మీడియాని ఆకట్టుకున్నది ఒక వ్యక్తి . అది కూడా మహిళ . ఇంతకీ అంత ప్రత్యేకత ఏంటి  అంటే తను తన నెలల చంటిబిడ్డని ఎత్తుకోవడమే . పిల్లల్ని ఎత్తుకోవడంలో విశేషమేముంది . పిల్లలని ఎత్తుకోవడంలో విశేషం లేదు కానీ ఎత్తుకుని విధులకి హాజరు కావడంలోనే విశేషం ఉంది .

Video Advertisement

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఒక కార్యక్రమం ఏర్పాటు  చేశారు . రెండు రోజుల పర్యటనలో భాగంగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ పాల్గొన్నారు .  ముఖ్యమంత్రి కార్యక్రమం కావడంతో భారిగా బంధోబస్త్ ఏర్పాటు చేశారు . అక్కడ విధుల్లో పాల్గొన్నది కానిస్టేబుల్ ప్రీతీరాణి . చంటిబిడ్డని తీసుకుని విధులకు హాజరు కావడంతో అందరి దృష్టి అటు మళ్లింది .

భర్తకి ఆ రోజు పరీక్ష ఉండడంతో బిడ్డని చూసుకోవడం ప్రీతి వంతయింది . దాంతో బిడ్డని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం , మరోవైపు ఉద్యోగం ముఖ్యం కావడంతో రెండింటిని వదులుకోలేక కూతురితోనే విధులకి హాజరయింది . గ్రేటర్ నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది ప్రీతిరాణి . ముఖ్యమంత్రి కార్యక్రమం అవ్వడంతో ఉదయం ఆరుగంటలకే వివిఐపి  భద్రత కార్యక్రమాలని అప్పచెప్పారు . దాంతో బిడ్డని తీసుకుని ఉదయం ఆరుగంటలకే డ్యూటికి వచ్చారు . చంటి బిడ్డనెత్తుకుని డ్యూటిలో పాల్గొన్న ప్రీతి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

నేడు పెరుగుతున్న అవసరాల రిత్యా భార్య , భర్త ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి . దాంతో పిల్లల్ని చూసుకోవడం కూడా ఆలుమగల ఇద్దరి వంతవుతుంది . ఉద్యోగం చేస్తున్న కుటుంబ ఆదాయం పెంచడంలో భాగస్వామ్యం అవుతున్నప్పటికి,  చాలావరకు తల్లులే పిల్లల సంరక్షణ తీస్కోవాల్సి వస్తుంది .


You may also like

Leave a Comment