సీతారామం హీరోయిన్ “మృణాల్ ఠాకూర్” కి… బాహుబలికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

సీతారామం హీరోయిన్ “మృణాల్ ఠాకూర్” కి… బాహుబలికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇటీవల రిలీజ్ అయిన సీతారామం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన నూతన నటి మృణాల్ ఠాకూర్, ఆమె అందంతో అభినయంతో అందరి మది దోచుకున్నారు. మృణాల్ ఠాకూర్ అంతకుముందు హిందీ సీరియల్స్ లో నటించారు. అలాగే సినిమాల్లో కూడా నటించారు. ఇది మృణాల్ ఠాకూర్ మొదటి తెలుగు సినిమా.

Video Advertisement

అయితే మృణాల్ ఠాకూర్ అంతకుముందే ఒక సినిమా చేయాల్సి ఉన్నా అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అది కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన బాహుబలి సినిమాకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్.

sita ramam movie review

మృణాల్ ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వెబ్ సిరీస్ అయిన బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ లో శివగామి యంగ్ గా ఉన్నప్పటి రోల్ చేయాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ యొక్క సరికొత్త టెలివిజన్ సిరీస్ బాహుబలి :బిఫోర్ ది బిగినింగ్ ,ఆనంద్ నీలకంఠన్ యొక్క “రైజ్ ఆఫ్ శివగామి” (2017) మరియు క్వీన్ ఆఫ్ మాహిష్మతి (2020) నవలల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సిరీస్ ను రాజమౌళి మరియు ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇందులోని మొదటి సీజన్ 9 ఎపిసోడ్స్ తో శివగామి జీవిత చరిత్రను మరియు ఒక సాధారణ అమ్మాయి నుంచి ఒక రాజ్యానికి అసమానమైన రాణిగా ఎదిగిన శివగామి జీవిత గమనాన్ని మన ముందుకు తీసుకొద్దామని అనుకున్నారు.

connection between mrunal thakur and baahubali movie

బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ నెట్ సిరీస్ లో నటి మృణాల్ ఠాకూర్ యంగ్ శివగామి క్యారెక్టర్ లో కనిపించాల్సి ఉంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఎంతో కష్టపడి గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విన్యాసాలు నేర్చుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె మహిష్మతి సింహాసనంపై ప్రతీకారంతో తిరుగుబాటు చేసే పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఈ సిరీస్ ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే ఇది కేవలం ఇండియాలోనే కాక ప్రపంచం మొత్తంలో 190 కంట్రీస్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సిరీస్ ఆగిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సిరీస్ కి సంబంధించిన విషయాన్ని మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

watch video :


End of Article

You may also like