Ads
భారతదేశంలోనే అతి తక్కువ ధరకి అది కూడా కేవలం 500 రూపాయలలో రెండు కొవిడ్ వాక్సిన్ ల డోసులని ఇచ్చేలా బయోలాజికల్ ఈ కంపెనీ ‘కోర్బెవ్యాక్స్’ రాబోతుంది. ప్రస్తుతం మూడవ దశలో ఉన్న క్లినికల్ ట్రైల్స్ అతి త్వరలోనే ఎమర్జెన్సీ అప్రూవల్ కింద ఆమోదం పొంది మార్కెట్ లోకి రాబోతుంది.
Video Advertisement
దీని ధర 400 రూపాయలకంటే కూడా తక్కువ ఉండవచ్చు అనే పలు వాదనలు కూడా ఉన్నాయి కాగా వీటి ధర ఎంత అని ఇంకా నిర్ధారింపబలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే బయోలాజికల్ ఈ సంస్థ నుంచి 30 కోట్ల కొవిడ్ టీకాలను కొనటానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
క్లినికల్ ట్రైల్స్ లోని ఫేస్-1 , ఫేస్-2 ,లో మంచి ఫలితాలను కనబరిచిన ‘కోర్బెవ్యాక్స్’ మూడవ దశలోని క్లినికల్ ట్రైల్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని రాబోయే కొన్ని నెలల్లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా ఆక్స్ఫర్డ్ సంస్థ కి చెందిన ‘కోవిషీల్డ్’ వాక్సిన్ ధర రెండు డోసులకి ధర రాష్ట్ర ప్రభుత్వాలకి 600 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1200 రూపాయలు గాను నిర్దేశింపబడింది. భారత్ బయోటెక్ సంస్థ కి చెందిన ‘కొవ్యాక్సిన్’ రెండు డోసుల ధర రాష్ట్ర ప్రభుత్వాలకి 800 రూపాయలు, ప్రైవేట్ హాస్పటిల్స్ కి 2400 రూపాయలుగా నిర్దేశింపబడింది. మరో వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ ఒక డోస్ ధర 995 రూపాయలు గా ఉంది.
Also Read : ఆన్ లైన్ లో డాక్టర్ ని కలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!
End of Article