Ads
కరోనా సెకండ్ వేవ్ మరింత దడ పుట్టిస్తుంది…ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలని సైతం వదిలి పెట్టడం లేదు.తెలంగాణ తో పోల్చుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మహమ్మారి విజృంభణ భారీగా ఉంది.నిత్యం ప్రతి రోజు..20 వేలకు పాజిటివ్ కేసులు తగ్గడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Video Advertisement
ఇకపోతే మొత్తం మీద దేశంలోని 8 రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ భారీగా ఉంటోందని పేర్కొనింది.8 రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఆంధ్ర ప్రదేశ్ 5 వ స్థానం లో ఉందని పేర్కొనింది.దేశంలోని 11 రాష్ట్రలో లక్షకు పైగా ఆక్టివ్ కేసులు ఉన్నట్టుగా పేర్కొనింది.రోజువారీ పాజిటివ్ కేసుల్లో 85 శాతం అక్కడే నమోదు అవుతున్నట్టు చెప్పింది.మరో వైపు పాజిటివిటీ రేట్ ఆందోళన కర స్థాయిలో 15 శాతం గా ఉన్నట్టు ప్రకటించింది, దేశవ్యాప్తంగా రేకవరీ రేట్ 83.83గా ఉన్నట్టు తెలిపింది ఆరోగ్య శాఖ.
also read : తెలంగాణ లో ఇవాళ 4,298 మందికి కొరోనా పాజిటివ్ గా నిర్ధారణ !
End of Article