స్మశానం లోనే ఐసోలేషన్.. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో..!

స్మశానం లోనే ఐసోలేషన్.. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో..!

by Anudeep

Ads

కరోనా మహమ్మారి కారణం గా రాను రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి చూస్తూనే ఉన్నాము. అయితే.. గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. అయితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండా లో నివసించే ప్రజలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అక్కడే కొత్త గా నిర్మించబడ్డ వైకుంఠ ధామం (స్మశాన వాటిక) ను కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం గా వినియోగించుకున్నారు.

Video Advertisement

corona isolation

అక్కడ తండావాసుల్లో ఇద్దరికీ పాజిటివ్ రావడం తో.. అందరు టెస్ట్ చేయించుకున్నారు. ఊరు మొత్తం లో 6 గురికి కరోనా సోకింది. వీరు వైకుంఠ ధామం లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వీరికి మొదటి రెండు రోజులు ఊరివారే భోజనం సమకూర్చగా.. ప్రస్తుతం రుద్రారం కు చెందిన యువత భోజనం అందిస్తున్నారు.


End of Article

You may also like