అర్ధరాత్రి ధైర్యంగా… ఈ దంపతులు చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

అర్ధరాత్రి ధైర్యంగా… ఈ దంపతులు చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anudeep

Ads

పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం అంటారు పెద్దలు. చీకట్లో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను ఎంతో ధైర్యం ప్రదర్శించి, దొంగను పట్టుకున్నారు ఓ రెండున్నర అడుగుల ఎత్తున దంపతులు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇప్పుడు ఈ జంటపై స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Video Advertisement

బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో నివసించే రంజిత్ పాశ్వాన్ – సునైనా అనే దంపతుల ఇంట్లోకి రాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. అల్మారా తెరిచి సామాన్లు బయటకు తీయడం ప్రారంభించాడు దొంగ. దొంగ ఇంట్లోకి ప్రవేశించిన విషయాన్ని రంజిత్ దంపతులు గుర్తించారు. ఆ దొంగ పారిపోకుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకవాలని రంజిత్ దంపతులు నిర్ణయించుకున్నారు. వెంటనే రెండున్నర అడుగుల పొడవున్న రంజిత్ పాశ్వాన్ మరియు అతని భార్య సునైనా ధైర్యంగా దొంగను పట్టుకోవడమే కాకుండా ఓ పోల్ కు అతడిని కట్టేశారు. అనంతరం వారు స్థానిక కృష్ణబ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన తర్వాత, స్థానిక ప్రజలు జంట యొక్క ధైర్యాన్ని కొనియాడారు. భార్యాభర్తలు భయపడి ఉంటే.. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లే వారని.. ఈ దంపతుల మనోధైర్యం వల్లే తమ ఇళ్లల్లో కూడా చోరీ జరగకుండా ఆగిందని స్థానికులు తెలిపారు. రంజీత్ పాశ్వాన్ భార్య సునైనా కూడా తన భర్తలాగే కేవలం రెండున్నర అడుగులు మాత్రమే. దొంగ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆమె తన భర్త రంజిత్‌కు సహకరించి దొంగను పట్టుకున్నట్లు చెబుతుంది. దంపతులు కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్‌లో దొంగపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి ఈ దంపతుల ధైర్యసాహసాలు ఇప్పుడు అందరూ ఎంత ఉన్నామని కాదు ఏం చేసామన్నదే మ్యాటర్ అని కొనియాడుతున్నారు.


End of Article

You may also like