పెండ్లికి రాకపోయినా రిసెప్షన్ బిల్ కట్టాలట.. ఇదెక్కడి విడ్డురమో..?

పెండ్లికి రాకపోయినా రిసెప్షన్ బిల్ కట్టాలట.. ఇదెక్కడి విడ్డురమో..?

by Anudeep

Ads

మనం ఎప్పుడైనా ఎవరి పెళ్ళికి అయినా వెళ్ళినప్పుడు.. ముచ్చట కొద్దీ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి ఏదో ఒక చిరు కానుకను అందిస్తూ ఉంటాము. అది వారు మననుంచి ఆశించకపోయినా.. మన తృప్తి కోసం ఇస్తాము. కానీ రాను రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి చూస్తే.. అంతో ఇంతో బాధ పడకుండా ఉండలేము. ఈ మధ్య పెళ్ళికి వెళ్లి రావడం అనేది ఓ మొక్కుబడి తంతు అయిపొయింది.

Video Advertisement

wedding

పెళ్లిళ్లు కూడా లేనిపోని హంగు ఆర్భాటాలకు పోతూ ఉండడం వలన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కొందరైతే.. కట్నకానుకలు కూడా లెక్కలు వేసి చూసుకుంటున్నారు. తాజాగా.. ఓ కొత్త జంట ఐతే తమ చుట్టాలకు గట్టి షాక్ ను ఇచ్చింది. పెళ్ళికి పిలిచిన తరువాత రాని వారికి.. వారికి ఏర్పాట్లు చెయ్యడానికి ఐన ఖర్చుని ఇవ్వాలంటూ ఇన్వాయిస్ బిల్లు పంపింది ఈ కొత్త జంట. ఈ జంట ఓ రిసార్ట్ లో రిసెప్షన్ ను పెట్టుకుని బంధుమిత్రులందరికి ఆహ్వానాలు పంపారు. వారి కోసం ఏర్పాట్లను కూడా ఘనం గానే చేసారు. కానీ వారు ముందు చెప్పకుండా పెళ్ళికి రాకపోవడం వలన.. వారికోసం బుక్ చేసిన సీట్లు, ఫుడ్ వేస్ట్ అయ్యాయి. ఈ వేస్ట్ అయిన వాటికి లెక్క కట్టి .. మనిషికి ఎంత పంపించాలో లెక్క కట్టి మరీ బిల్ పంపించారు. ఈ అమౌంట్ ను గూగుల్ లేదా పే పాల్ ద్వారా చెల్లించచ్చని.. నెల రోజులు గడువు ఇస్తున్నామని కూడా చెప్పారు.


End of Article

You may also like