“మేము వెళ్లిపోతున్నాం. మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మా కూతురు చాలా అమాయకురాలు. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని తనని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. పిల్లలు మిమ్మల్ని ఎవరు ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం..” అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్నసెల్ఫీ వీడియో లో తెలిపారు.
Video Advertisement
ఆ వీడియో ని తమ కుమారుడికి, ఇంకా కొందరు బంధువులకు పంపి ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేసి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. ఆ వీడియో లోని వ్యక్తిని చిత్రాడ వరప్రసాద్ గా గుర్తించారు. విశాఖ పరిధిలోని వడ్లపుడిలో ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్ లో చిత్రాడ వరప్రసాద్ (47), మీరా (41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. ఇటీవలే తమ కుమార్తె కి వివాహం చేసారు ఈ దంపతులు.
గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోను చూసిన ఈ దంపతుల కుమారుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు.
చివరికి ఆ దంపతుల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ముందుగా భర్త, ఉక్కు ఉద్యోగి వర ప్రసాద్ మృతదేహం.. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి రాజుపాలెం దగ్గరలోని ఏలేరు కాలువ వద్ద దొరికింది. ఆ తర్వాత కాసేపటికే అదే కాలువకు మరికొంత దూరంలో భార్య మృతదేహం కూడా గుర్తించారు పోలీసులు.
వరప్రసాద్, మీరా కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. ఇటీవలే ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే కుమారుడు కృష్ణ సాయి తేజ బ్యాటరీ దుకారణం నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా సమయం నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు. ఈ సెప్తాహ్యం లో వార ప్రసాద్ భారీ మొత్తాల్లో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు ఎక్కువై తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.