Home Filmy Adda Samantha : సమంతకు ఉరటనిచ్చిన కోర్టు.. తీర్పు ఏమని ఇచ్చిందంటే..?

Samantha : సమంతకు ఉరటనిచ్చిన కోర్టు.. తీర్పు ఏమని ఇచ్చిందంటే..?

by Anudeep

సమంత- నాగ చైతన్యల విడాకుల వ్యవహారం టాలీవుడ్ ను ఒక్కసారిగా కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం గురించి సోషల్ మీడియాలలో వచ్చిన కధనాలు అన్ని ఇన్ని కావు. అయితే.. వీటిల్లో వాస్తవాల కంటే పుకార్లు ఎక్కువగా ఉండడంతో సమంత కోర్టు మెట్లు ఎక్కింది. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీలతో పాటు వెంకట్రావ్ అనే అడ్వొకేట్ పై కూడా సమంత పిల్ ను వేశారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆ ఛానెల్స్ వారిని క్షమాపణ కోరాలని చెప్పారు. అంతే కాదు.. ఈ యు ట్యూబ్ ఛానెల్స్, డా.సీఎల్ వెంకట్రావు గారు అప్ లోడ్ చేసిన వీడియోలను కూడా తొలగించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పై ఎవరు సమంత వ్యక్తిగత విషయాల గురించి ప్రచారం చేయకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది.

You may also like