కోర్ట్ సీన్స్ లో ఇలా సినిమాల్లోనే జరుగుతుంది అనుకుంటా.? నిజంగా ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

కోర్ట్ సీన్స్ లో ఇలా సినిమాల్లోనే జరుగుతుంది అనుకుంటా.? నిజంగా ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

by Mohana Priya

Ads

సాధారణంగా చాలా వరకు సినిమాలు నిజ జీవితానికి కొంచెం దూరంగానే ఉంటాయి. అంటే క్యారెక్టరైజేషన్ అదంతా మామూలుగా ఉన్నా కానీ సినిమాల్లో జరిగే సీన్స్ మాత్రం అంత నార్మల్ గా ఉండవు. సోషియో ఫాంటసీ సినిమాలు లేకపోతే పిరియాడికల్ సినిమాలు అంటే డిఫరెంట్ గానే ఉంటాయి. ఇంతవరకు బానే ఉంటుంది. కానీ మామూలు సినిమాలు కూడా రొటీన్ కి దూరంగానే ఉంటాయి.

Video Advertisement

అంటే నిజ జీవితంలో పాటలు అలాంటివేమీ ఉండవు. కానీ సినిమాల్లో పాటలు వస్తాయి. అలాగే సినిమాల్లో ఫైటింగ్స్ కూడా ఉంటాయి. ఆ ఫైట్స్ కూడా సాధారణంగా ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన గొడవ లాగా కాకుండా చాలా బాగా కంపోజ్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే. మనం చాలా సినిమాల్లో కోర్ట్ సన్నివేశాలు చూసే ఉంటాం.

ఈ కోర్ట్ లో వచ్చే సీన్స్ సినిమాల్లో కొంచెం ఎక్కువగా ఎమోట్ చేసే లాగా ఉంటాయి. అంత ప్లెయిన్ గా ఉండవు. ఆ కోర్ట్ సీన్స్ లో ఒక డ్రామా క్రియేట్ అవుతుంది. కొంచెం సస్పెన్స్ ఉంటుంది. అలాగే ఆ కోర్ట్ సీన్ లో హీరో ఇన్వాల్వ్ అవుతే ఆ సీన్ ఖచ్చితంగా ప్లెయిన్ గా అయితే ఉండదు.

అయితే మనం సాధారణంగా టీవీలో చూసేటప్పుడు ఏదైనా కోర్ట్ కేస్ గురించి ఉంటే ఇవాళ ఆ విషయం గురించి కోర్టులో విచారణ ఉంది అని మాత్రమే చూస్తాం. కానీ సినిమాల్లో మాత్రం కోర్టు లో జరిగేది లైవ్ టెలికాస్ట్ టీవీలో చూపిస్తూ ఉంటారు. నిజజీవితంలో అయితే ఇలా ఏదైనా ఒక పర్టిక్యులర్ కేస్ గురించి విచారణ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ లైవ్ టెలికాస్ట్ అయితే వెయ్యలేదు.

కానీ సినిమాల్లో మాత్రం టెలికాస్ట్ చేస్తారు. ఇలా కోర్టు లో జరిగే విషయాలని లైవ్ టెలికాస్ట్ రూపంలో చూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఏదేమైనా అది సినిమా కాబట్టి సినిమాల్లో ఉండే పాత్రలు జరిగే సన్నివేశాలు కల్పితం కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి విషయాలను అంత సీరియస్ గా తీసుకోకుండా కథకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు


End of Article

You may also like