మేనరికం పెళ్లి వల్ల ఈ ఇబ్బందులు వస్తాయా.? పెళ్లి చేసుకోబోయే బావమరదళ్ళు ఇది తప్పక తెలుసుకోవాలి.!

మేనరికం పెళ్లి వల్ల ఈ ఇబ్బందులు వస్తాయా.? పెళ్లి చేసుకోబోయే బావమరదళ్ళు ఇది తప్పక తెలుసుకోవాలి.!

by Mounika Singaluri


ఎక్కువ మంది మేనరిక పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. సొంత అత్త కూతురుని చేసుకోవడం లేదా సొంత అత్త కొడుకుని చేసుకోవడం లేదా మావయ్యను మేనకోడలు చేసుకోవడం వంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే అటువంటి వివాహాలు చేసుకోకూడదని మనం ఎన్నోసార్లు వినే ఉంటాం.

మరి నిజంగా అటువంటి పెళ్లిళ్లు చేసుకోవచ్చా..? అటువంటి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయా రావా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మందిలో ఈ అనుమానం ఉంటుంది. మేనరికపు పెళ్లిల్లు చేసుకోవచ్చా లేదా అనేది.

source: screenshot from arranged marriage short film

ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జన్యు పరంగా, క్రోమోజోమ్స్ పరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో మళ్ళీ మళ్ళీ మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఆ సమస్యలు కలుగుతూ ఉంటాయి. వ్యాధులు ఏమైనా ఉంటే అవి తీవ్రంగా మారడం కూడా జరుగుతుంది. కుటుంబంలో ఏదైనా సమస్య ఉండడం వలన కూడా పాస్ అవుతూ ఉంటాయి. కనుక మేనరికం పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలానే జన్యువులలో ఏ సమస్య వున్నా కూడా అది ఇద్దరి జన్యువులు బిడ్డకు సంక్రమిస్తుంది. అది పుట్టే బిడ్డ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ముందు తరాల వాళ్ళది కూడా ఇలాంటి వివాహమే అయితే పుట్టే బిడ్డకు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేనరికం వివాహం అయ్యి పుట్టిన పిల్లల్లో జెన్యూ సమస్యలు 4-6 శాతం ఉండచ్చు. మాములు దానికంటే ఇవి రెట్టింపుంటాయి. కానీ అందరికీ సమస్యలు ఉంటాయని చెప్పలేము.

అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. రిస్క్ అనేది మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం మొదటి సారి, రెండో సారి, మూడవ సారి అనే వాటి పైన ఆధార పడి వుంది. మొదటిసారి చేసుకోవడం వల్ల పెద్దగా సమస్యలేమీ కలగవు ఎక్కువగా కుటుంబంలో మేనరికాలు రిపీట్ అవుతూ ఉంటే అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది మేనరిక సంబంధాలు చేసుకోరు.

కేవలం జన్యుపరంగా మాత్రమే కాకుండా మేనరికం పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి.చిన్నప్పటి నుండి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వారిలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవచ్చు. వయసు తేడా ఎక్కువగా ఉండి అబ్బాయి పెద్దవాడు అయితే ఇంకా అమ్మాయి చిన్న పిల్లలానే కనబడుతూ ఉంటుంది. ఇలాంటి కారణాల వలన కూడా మేనరికం పెళ్లిళ్లు చేసుకోరు.

ఒకవేళ కనక అమ్మాయి అబ్బాయి ఇష్ట పడి మేనరికం మొదటి సారి అయితే పరవాలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జెనిటిక్ కౌన్సెలర్ ని పెళ్ళికి ముందు కన్సల్ట్ చేస్తే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఒకవేళ మేనరికం పెళ్లి చేసుకుంటే జాగ్రత్త పడాలి. గర్భిణీలు జన్యు సమస్యలు, అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయేమో స్కానింగుల ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడాలి.

 

 

 

You may also like