Ads
covid vaccine side effects facts: వ్యాక్సిన్ పై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయ్ ..ముఖ్యంగా జ్వరంతో చని పోతాం అని, వికటించి చనిపోతాం అని ప్రజలు ఎన్నో అపోహలు పెట్టుకుంటుంటారు, అంతేకాదు టీకాలు ఆరోగ్యానికి మంచిది కాదు అని వాళ్ళు వీళ్ళు చెప్పినమాటలు వింటూవుంటారు.వాక్సిన్ తీసుకుంటే రక్త స్రావం. రక్తం గడ్డ కట్టడం వంటి అపోహలు అనుమానులు ఉన్న నేపథ్యం లోకేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు.
Video Advertisement
కరోనా వాక్సిన్ తీసుకున్నవారిలో ఇటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయియని నిపుణుల కమిటీ పేర్కొంది.ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చింది.ఇదిలా ఉండగా..మార్చి 11న కొన్ని దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భారత్ లోని కోవిషీల్డ్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఈ అంశం పైన వెంటనే నివేదిక ఇవ్వాలంటూ కేంద్రం నిపుణులను సూచించింది.ఏప్రిల్ 3 నాటికి 7,54,35,381 వాక్సిన్ డోసులు అందించగా వారిలో సుమారు ఇరవై మూడువేలమందికి దుష్ప్రభావాలు కనపడ్డాయి.
అందులో కేవలం 700 కి మాత్రమే అత్యత తీవ్రమైన పరిణామాలు చూపించాయి.కానీ ఇక్కడ కోవిషీల్డ్ తీసుకున్నవారిలో మాత్రమే ఈ సంఘటనలు వెలుగు చూసినట్టు చెప్పింది. ఇతర దేశాలు బ్రిటన్ లో మాత్రం 10 లక్షల డోసులకు కేవలం 4 కేసుల్లోనూ, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు కేవలం 10 కేసుల్లోనూ దుష్ప్రభావాలు కనిపించాయట
End of Article