ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కరోనా ని సంబంధించి వ్యాక్సిన్ ఇప్పుఇప్పుడే అన్ని దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నారు అయితే కొన్ని చోట్ల మాత్రం అవి దుష్పరిణామాలు చూపిస్తున్నాయి కూడా ..ఇలాంటి సంఘటన ఒకటి ఎదురయ్యింది. ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోలోని ఒక వైద్యురాలు హాస్పిటల్ పాలయ్యారు.

Video Advertisement


వాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికి శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు అవ్వడంతో పాటు చర్మంపై దద్దుర్లు కూడా రావటంలో ఉత్తర రాష్ట్రమైన న్యువో లియోన్ లోని ఒక పబ్లిక్ హాస్పిటల్ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెరిపించారు ఆమెకు ఎన్సెఫలోమైలిటిస్ సోకిందని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది ఎన్సెఫలోమైలిటిస్ అంటే మెదడు మరియు వెన్నెముక లో వాపు. అయితే ఆ వైద్యురాలికి గతంలో కూడా కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నటు తెలిపారు.కానీ క్లినికల్ ట్రైల్స్ లో ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది..మెక్సికోలో ఇప్పటి దాకా COVID-19 వలన 126,500 మందికి పైగా మరణించారు. డిసెంబర్ 24 న దేశం ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మొదటి రౌండ్ COVID-19 వ్యాక్సిన్లను పంపిణీ చేయడం ప్రారంభించింది.