Ads
కొంతమందిని చూస్తే.. మరీ ఇంత అమాయకం గా ఎలా బతుకుతున్నారు రా బాబు అనిపించేలా ఉంటారు. మన జీవితం లో మనకు ఎదురయ్యే కొందరు వ్యక్తుల్ని చూసి మనం అలా అనుకోకుండా ఉండలేము. ఇపుడు ఈ ఆర్టికల్ చదివితే.. జనాలు ఇలా కూడా ఉన్నారా అని మీకు కచ్చితం గా అనిపిస్తుంది. అంతలా పడి పడి నవ్వడానికి ఏముందా అని అనుకుంటున్నారా..? అదేంటో మీరే చదివి తెలుసుకోండి.
Video Advertisement
మనం ఆవు పిడకల్ని పూజల్లో వాడుతూ ఉంటాము కదా. ఒకప్పుడు ఇంటికో ఆవు ఉండేది కాబట్టి వీటిని కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. కార్పొరేట్ కల్చర్ వచ్చాక ఆవుల్ని దగ్గరుండి చూడడం కూడా అరుదుగానే జరుగుతోంది. దీనితో ఆవు పిడకల్ని కూడా అమెజాన్ ఆన్ లైన్ లో విక్రయించేస్తోంది. ఈ క్రమం లో కౌ డంగ్ కేక్ (COW DUNG CAKE) ను చూసి ఓ వ్యక్తి నిజం గానే కేక్ అనుకుని ఆర్డర్ పెట్టేసాడు.
తీరా వచ్చాక అయినా అవి ఆవు పిడకలు అని తెలుసుకోవాలి కదా. అది కూడా లేదు.. అది నిజం గానే ఆవు పేడ తో చేసిన కేక్ అనుకుని తినేసాడు కూడా. అక్కడితో ఆగకుండా, ఆ మహానుభావుడు దానికి రివ్యూ కూడా ఇచ్చాడు. “ఈ కేక్ మడ్డి వాసన వేస్తోంది.. దీనిని శుభ్రమైన పరిసరాల్లో తయారు చేయించి ఉంటె బాగుండేది.. గడ్డి వాసన వస్తోంది. దీనిని తిన్న తరువాత నాకు మోషన్స్ అయ్యాయి. వీటిని శుభ్రం గా తయారు చేయండి. కరకర లాడే విషయం లోను, వీటి టేస్ట్ విషయం లో ను మరింత జాగ్రత్త తీసుకోండి” అంటూ అమెజాన్ లో రివ్యూ పెట్టాడు.
ఈ రివ్యూ ను చూసిన సంజయ్ అరోరా అనే వ్యక్తి దానిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనితో ఈ ట్వీట్ మరింత వైరల్ అయింది. అది ఆవు పేడ కేక్ అనుకున్నావా.. దూద్ పెడా అనుకున్నావా అంటూ నెటిజన్లు వీర లెవల్లో ట్రోల్ చేస్తున్నారు.
End of Article